Rajamouli Praises Allu arjun | అల్లు అర్జున్ ఇండస్ట్రీకి గిఫ్ట్..బన్నీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్: రాజమౌళి
పుష్ప (Pushpa) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli )అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు.

టాలీవుడ్ (Tollywood )స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun) నటిస్తోన్న చిత్రం పుష్ప (Pushpa). ఇవాళ యూసుఫ్ గూడ పోలీస్‌గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli )మాట్లాడుతూ..అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించాడు.
‘ఈ రోజు నాకు కొంచెం బాధగా ఉంది..ఆనందంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ సుక్కూ (Sukumar)ఇక్కడ లేడు..పుష్పను బెస్ట్ గా చూపించడానికి బాంబేలో బిజీగా ఉన్నాడు. నాకు సుక్కూ అంటే చాలా చాలా ఇష్టం. తన సినిమాలంటే చాలా ఇష్టం. మేమిద్దరం మెసేజ్‌లు పెట్టుకుంటుంటాం. మా ఇద్దరిదీ మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్. ఏదైనా విడుదలైతే సుక్కూ అదిరిపోయిందని నేను..నాదేదైనా రిలీజైతే సార్ చింపేశారని తను చెప్పుకుంటా ఉంటాం..ఈ మధ్య టైం సరిపోవట్లేదని సుక్కూ మెసేజ్ పెడితే..సుక్కూ నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకు చేసేయ్..ప్రతీది అనుకున్నట్టుగా వస్తుందన్నాను. దానికి తగ్గట్టుగానే ఒక్క సెకన్ కూడా గ్యాప్ లేకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడని’ సుకుమార్ గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి.
‘సినిమా అద్బుతంగా వస్తదని ధీమాగా చెప్తున్నా. నేను ఆర్ఆర్ఆర్ పని మీద బాంబే వెళ్తున్నపుడు..ఎక్కడ ఎవరిని, ఏ సినిమా కోసం చూస్తున్నారని అడిగినా..బాంబేలో ప్రతీ ఒక్కరూ పుష్ప కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ఈ సినిమాను అక్కడ బన్నీ ప్రమోట్ చేయాలి. ఇందులో నా స్వార్థంతోపాటు ఇండస్ట్రీ స్వార్థం కూడా ఉంది. పుష్ప నీ సినిమా కాదు..తెలుగు ఇండస్ట్రీ సినిమా..అది ఎంత దూరమెళ్లాలో..ఎంత పెద్దగా వెళ్లాలో వెళ్లాలి. సినిమా చూస్తున్నపుడు నాకు బాగా నచ్చింది విజువల్స్. సినిమా కోసం అల్లు అర్జున్ పెట్టే డెడికేషన్ కు పడే కష్టానికి, డైరెక్టర్ మీద నీకున్న నమ్మకానికి ..నువ్వు ఇండస్ట్రీకి ఓ బహుమతి అని’ బన్నీని ఆకాశానికెత్తేశాడు జక్కన్న.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
MP Santosh kumar | ‘బిగ్ బాస్ 5 ‘ చీఫ్ గెస్ట్ గా ఎంపీ సంతోష్‌కుమార్
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

