నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ (AKhanda). విడుదలైన రోజుల నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. చాలా కాలం తర్వాత అఖండతో మంచి విజయాన్ని అందుకుంది ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal). ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ప్రగ్యాజైశ్వాల్. ప్రగ్యాజైశ్వాల్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ‘నేను చాలా సంతోషంగా ఉన్నా. మా సినిమా అఖండకు వస్తున్న స్పందనను చూసి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మా చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో వీక్షించా. సినిమా నడుస్తున్నంత సేపు ఈలలు, కేకలతో థియేటర్లు షేక్ అయ్యాయి. అఖండకు వస్తున్న ఊహించని రియాక్షన్ ఆనందంలో ముంచెత్తుతోందని’ చెప్పుకొచ్చింది ప్రగ్యా.
‘గతంలో ఎన్నడూ పొందని అనుభూతిని ఈ సినిమా అందించింది. అఖండలో నా పాత్ర డిఫరెంట్ షేడ్స్ లో సాగుతుంది. నా పాత్రకు మంచి స్పందన వస్తుంది. అఖండ పాటలను సోషల్ మీడియాలో రీక్రియేట్ చేస్తుండటం చాలా ఎక్జయిటింగ్‌గా ఉందంటూ’ చెప్పుకొచ్చింది ప్రగ్యాజైశ్వాల్. ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అఖండ క్రేజ్‌ను మరింత పెంచిందని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు.
డిసెంబర్ 2న విడుదలైన అఖండ కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని..బాలకృష్ణ కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సినిమాగా ఉన్న గౌతమీ పుత్ర శాతకర్ణి రికార్డులను బద్దలు కొట్టినట్టు ట్రేడ్ పండితుల అంచనా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde saree | పూజాహెగ్డే చీర ఖరీదు తెలిస్తే షాకే..!
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!