సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అంటేనే ఖరీదైందిగా ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్లు వాడే ప్రతీ వస్తువు విషయంలో బ్రాండ్లను మెయింటైన్ చేస్తుంటారు. ఇంతకీ ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటనే కదా మీ డౌటు. సెలబ్రిటీల్లో ఇపుడు పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) వేసుకున్న చీరతో ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. గత వారం లాక్మే ఫ్యాషన్ వీక్ లో యెల్లో కలర్ డిజైనర్ చీర (yellow colored saree)లో తళుక్కున మెరిసింది పూజాహెగ్డే.
బంగారపు చంకీలు పొదగవడ్డ జాకెట్‌తో అర్పితా మెహతా రూపొందించిన చీరలో ధగ ధగ మెరిసిపోయింది పూజాహెగ్డే. ఈ చీరను రూ.48 వేలకు డిజైన్ చేసిందట. ఇంతకీ పూజాహెగ్డే వేసుకున్న డ్రెస్సు లో లెహెంగా ఖరీదెంతో తెలుసా..? రూ. 2 లక్షలు. సంప్రదాయక చీరకట్టులో అరుదుగా కనిపించే పూజాహెగ్డే తన కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక్క చీర, డ్రెస్సుల విషయంలోనే కాదు గాగుల్స్, ఫుట్ వేర్స్, హ్యాండ్ బ్యాగ్స్..ఇలా అన్ని విషయాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఖరీదైన బ్రాండ్లను వాడటం పూజాహెగ్డేకున్న అలవాటు.
పూజాహెగ్డే లూయిస్ వుయిట్టన్ బ్యాగు ఖరీదే (Louis Vuitton bag) రూ.2.6 లక్షలు అంటే ఈ భామకున్న బ్రాండింగ్ రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. మొత్తానికి హీరోయిన్లంతా ముక్కున వేలేసుకునేలా లగ్జరీ లైఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది పూజాహెగ్డే.
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!