Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
పుష్ప (Pushpa) ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాటల రచయిత చంద్రబోస్ (Chandrabose) చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

టాలీవుడ్ (Tollywood )స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun) నటిస్తోన్న చిత్రం పుష్ప (Pushpa). ఇవాళ యూసుఫ్ గూడు పోలీస్‌గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్లో పాటల రచయిత చంద్రబోస్ (Chandrabose) చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
‘సిరివెన్నెల తెలుగు ప్రేక్షకులకు ఎన్నో ఏళ్లుగా గానామృతాన్ని అందిస్తూ వచ్చారు. ఆయన నడిచి వెళ్లిన విడిచివెళ్లిన బాటలో పాటల పల్లికిని మోసే బోయిల్‌లో నేనూ ఒకడిని. ఆ పనిని బాధ్యతగా, పవిత్రంగా చేస్తూ సాగుతున్నా.. సినిమాలో నా పాటలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్‌కు, మంచి సందర్బాలు సృష్టించిన సుకుమార్ ధన్యవాదాలు. ఇందులో ఉన్న మొత్తం ఐదు పాటలు నేనే రాశాను. అరుదైన కథకు, అరుదైన సందర్భాలకు, అరుదైన భావజాలంతో పాటలు రాసే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తున్నా’నన్నారు.
‘పాటంటే కేవలం మాటల పొందిక కాదు..భావాల పేటిక, ఆలోచనల సంచిక అని మొదటి నుంచి నమ్ముతూ నా 26 ఏండ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాను. రాసిన అన్నీ పాటల్లో కూడా బలమైన భావజాలం ఉంటూనే..తేలికైన మాటలతో అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో రాస్తూ వస్తున్నాను. ఎవడ్రా నువ్వు..ఎవడ్రా నువ్వు..ఇనుమును ఇనుమును నేను..నన్ను కాల్చితే కత్తవుతాను..ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు..మట్టిని మట్టిని నేను..నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు..రాయిని రాయిని నేను..గాయం కానీ చేశారంటే ఖాయంగా నే దేవుణ్ణయితా..(hey bidda idi naa adda)హే బిడ్డా ఇది నా అడ్డా..ఆ పక్కా నాదే..ఈ పక్కా నాదే తలపైనా ఆకాశం ముక్కా నాదే..ఆ తప్పూ నేనే ఈ ఒప్పూ నేనే..తప్పొప్పులు తగలెట్టే నిప్పూ నేనే’అంటూ చంద్రబోస్ పుష్పలో వచ్చే పాట పాడి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
MP Santosh kumar | ‘బిగ్ బాస్ 5 ‘ చీఫ్ గెస్ట్ గా ఎంపీ సంతోష్‌కుమార్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

