e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?

వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?

వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?

ఏదైనా చేయండి.. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ మాత్రం ఇవ్వండి.. కావాలంటే ఎంతైనా ఇస్తాను.. ఈ డైలాగులు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పవన్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం కూడా గొప్పగా ఫీల్ అవుతుంటారు అభిమానులు. అందుకే ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతిసారి థియేటర్ ఓనర్లు కూడా ఫిక్స్ అయిపోయి ఉంటారు. మూడేళ్లుగా ఈ ఫీల్ మిస్ అయ్యారు అభిమానులు. మూడేళ్ల‌ తర్వాత ఇప్పుడు ఈయన వకీల్ సాబ్ సినిమాతో వస్తున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో లాయర్ గా నటిస్తున్నాడు పవర్ స్టార్.

వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?


పింక్ సినిమాకు రీమేక్ అయినా కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లు చాలా మార్పులే చేశాడు వేణు. ఈ స్క్రిప్ట్ పై దాదాపు ఏడాదికి పైగానే ఖర్చు చేశాడు ఈ దర్శకుడు. పవన్ కోసం కొత్త సీక్వెన్సులు కూడా రాసుకున్నాడు. ఉన్నది ఉన్నట్లు కాకుండా కేవలం థీమ్ మాత్రమే తీసుకుని మిగిలినదంతా సొంతంగా రాసుకున్నాడు వేణు శ్రీరామ్. ఇదిలా ఉంటే ఈ సినిమా తొలిరోజు షోల గురించి అప్పుడే టాపిక్స్ మొదలైపోయాయి. ఏప్రిల్ 9 రోజు ఏం చేయాలి.. ఎన్ని థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయాలి అంటూ ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారు. పవన్ సినిమా అంటే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందుకే వకీల్ సాబ్ విషయంలో కూడా అదే జోరు చూపిస్తున్నారు ఎగ్జిబిటర్లు. దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాను దాదాపు 1800 స్క్రీన్స్ లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్స్ కూడా ఇప్పుడు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాయి. వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ రేట్ ఏకంగా 2000 రూపాయలుగా నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం 1200 నుంచి 1500 మధ్యలో ఉండబోతుంది ఈ రేట్. మరీ ఇంత రేట్ అయితే ఎలా అనే టాక్ వినిపస్తున్నా కూడా పవన్ ఫ్యాన్స్ చూస్తారంటూ థియేటర్ యాజమాన్యం నమ్మకంగా కనిపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇర్ఫాన్ ఖాన్ దుస్తుల్లో ఫిల్మ్‌ఫేర్‌కు బాబిల్‌ఖాన్ ‌

దండేలి అడ‌వుల్లో ప్ర‌గ్యాజైశ్వాల్ ఏం చేస్తుందంటే..?

విమ‌ర్శ‌ల గురించి బాధ‌ప‌డొద్దు: ఇలియానా

అరణ్య 2 డేస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు రానా

నేను పాగ‌ల్‌ను అనుకుంటారు: విశ్వ‌క్ సేన్‌

కొత్త డైరెక్ట‌ర్ తో సినిమాకు నాని గ్రీన్ సిగ్న‌ల్‌..!

పింక్ డ్రెస్ లో త‌మ‌న్నా త‌ళుక్కులు..ఫొటోలు వైర‌ల్

సెకండ్ వేవ్‌తో భ‌య‌ప‌డుతున్న పాన్ ఇండియా సినిమాలు

హీరోపై చీటింగ్ కేసు.. బెయిల్ ఇవ్వొద్దంటూ డిమాండ్

18 ఏళ్ల గంగోత్రి.. ఎమోష‌న‌ల్ అయిన అల్లు అర్జున్

నిరాశ‌ప‌రిచిన చావు క‌బురు చ‌ల్ల‌గా.. గీతా ఆర్ట్స్ 2లో డిజాస్ట‌ర్

బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ ప‌రుగో ప‌రుగు..!

ప్ర‌కృతి అందాల న‌డుమ హాట్ హాట్‌గా క్యూటీ భామ‌

Advertisement
వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement