విమర్శలపై బాధపడాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయని అంటోంది గోవా బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తో కలిసి నటిస్తోన్న ది బిగ్ బుల్ ఓటీటీలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో తన మనసులో భావాలను షేర్ చేసుకుంది.
ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. మీరు ఓ సినిమాతో వస్తుంటే…మేము దాన్ని 10 సంవత్సరాల కిందటే చూశామని కొందరు అంటున్నారు. ప్రేక్షకులు తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్చ ఉంటుంది. మీరు ప్రతీ ఒక్కరిని వ్యతిరేకించలేరు. కొంతమంది ఇష్టపడితే..మరికొందరు ఇష్టపడరు. నిజమేంటో తెలుసుకోవాలనే ఆలోచనతో ఉండటం సరికొత్త అనుభూతినిస్తుంది. మా చిత్రాన్నిప్రేక్షకులు ఇష్టపడతారని మనస్పూర్తిగా అనుకుంటున్నా. అభిషేక్ అద్బుతంగా నటించాడని చెప్పుకొచ్చింది.