2020లో హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ నటుడు విశ్వక్సేన్. ప్రస్తుతం పాగల్గా ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ కాంబోలో వస్తున్న పాగల్ మే 1న విడుదల కానుంది. రేపు విశ్వక్సేన్ బర్త్డే. అంతేకాదు పాగల్ షూటింగ్ కి కూడా చివరి రోజు. పుట్టినరోజు కూడా విరామం తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
ఆ తర్వాత ఏప్రిల్ 3 నుంచి పీవీవీ సినిమా బ్యానర్లో ఓ మై కడువలే రీమేక్ చిత్రీకరణ మొదలుపెట్టనున్నాడు. అయితే పాగల్ ట్రైలర్ ను కేవలం థియేటర్లలో చూసే అవకాశం ఉందంటున్నాడు విశ్వక్సేన్. మేము పాత విధానాన్ని ఫాలో అవుతున్నాం. ట్రైలర్ను థియేటర్లలో ప్లే చేయాలన్న ఆలోచన దిల్రాజుది..నాకు కూడా బాగా నచ్చిందని చెప్పాడు.
నేను పాగల్ని అని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ఆ టైటిల్ ఎందుకు పెట్టాడో మీకే తెలుస్తుందని అన్నాడు. బిజీ షెడ్యూల్ వల్ల హిట్2 చేయలేకపోతున్నానని చెప్పాడు. అడివిశేష్ హీరోగా హిట్ 2 లాంచ్ అయిన సంగతి తెలిసిందే.