18 ఏళ్ల గంగోత్రి.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రంగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందో మూవీగా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సాంఘిక తెలుగు సినిమా గంగోత్రి. ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ కి తన చేతుల మీదుగా వంద రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట రాఘవేంద్రరావు. ఈ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాఘవేంద్రరావు.
గంగోత్రి చిత్రం మార్చి 28,2003న విడుదల కాగా, నేటితో ఈ చిత్రం విడుదలై 18 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. నా తొలి చిత్రం విడుదలై నేటితో 18 ఏళ్లు అయింది. నా 18 ఏళ్ల జర్నీలో నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతాభావంతో నా హృదయం నిండిపోయింది. ఇన్నాళ్లుగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నేను ధన్యుడిని అంటూ బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 18 years
- Allu arjun
- gangotri
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

