మలయాళ బ్యూటీ మాళవిక మోన్ ప్రకృతి అందాల నడుమ ఫొటో షూట్ చేసింది. గ్రీన్ డ్రెస్‌లో కసిగా చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సినిమాల కన్నా కూడా ఫొటో షూట్స్ తోనే మాళవిక ఎక్కువగా పాపులర్ అయింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం మాళవికా మెహన్ ధనుష్ కథానాయకుడిగా ‘డి43’ వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. తెలుగులో మహేష్ సరసన సినిమా చేయాలనేది ఈ అమ్మడి కోరిక అని ఇటీవల తెలిసింది. మాళవిక ఎవరో కాదు మహేష్ కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించిన కె.యు.మోహనన్ కుమార్తె. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో కథానాయికగా రాణిస్తోంది.