నాలుగేళ్ల తర్వాత రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. రెండో రోజు ఈ సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. చాలా చోట్ల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరణ్య సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..
నైజాం- 0.70 కోట్లు
సీడెడ్- 0.29 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.30 కోట్లు
ఈస్ట్- 0.15 కోట్లు
వెస్ట్- 0.13 కోట్లు
గుంటూరు- 0.27 కోట్లు
కృష్ణా- 0.13 కోట్లు
నెల్లూరు- 0.08 కోట్లు
‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.16 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యంగా కనిపిస్తోంది. దాంతో రానా దగ్గుబాటికి మరో ఫ్లాప్ తప్పేలా లేదు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ కమర్షియల్ గా మాత్రం సేఫ్ కావడం కష్టం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆదిపురుష్ : గ్రీన్ మ్యాట్తోనే సగానికి పైగా సినిమా
చరణ్‌తో స్టైలిష్ ఫొటో దిగిన ఎన్టీఆర్.. పిక్ వైరల్
థ్యాంక్యూ బ్రో అంటూ అనుష్క ట్వీట్
అమెరికాలో రెస్టారెంట్ పెట్టిన ప్రియాంకా చోప్రా