వేదం నాగయ్య మృతి.. ప్రముఖుల సంతాపం

వేదం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య శనివారం కన్నుమూశారు. 30కి పైగా సినిమాలలో నటించిన నాగయ్య అందరి దృష్టిని ఆకర్షించారు. గుంటూరు జిల్లా, నర్సరావు పేట సమీపంలోని దేసవరం పేట గ్రామానికి చెందిన నాగయ్యకు ఊర్లో రెండెకరాల భూమి ఉండేది. అక్కడ పని లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు.
ఇచ్చిన డైలాగ్‌ని కంఠస్తం పట్టి గడగడ చెప్పడంతో అతని ప్రతిభని గుర్తించి వేదం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి అతనికి వేదం నాగయ్యగా పేరు వచ్చింది. నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజి ఇలా పలు సినిమాలలో నటించిన నాగయ్య తొలుత మూడు వేల పారితోషికం అందుకున్నారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. సినిమా ఆఫర్స్ లేక పూట గడవడం కష్టంగా మారిన నాగయ్యకు సీఎం కేసీఆర్, మా అసోసియేషన్ అండగా నిలిచింది. కొన్నాళ్లుగా నాగయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుదిశ్వాప విడిచారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

