e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News నితిన్ కెరియ‌ర్‌లో సెకండ్‌ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్..

నితిన్ కెరియ‌ర్‌లో సెకండ్‌ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్..

నితిన్ కెరియ‌ర్‌లో సెకండ్‌ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్..

నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన రంగ్ దే సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. కలర్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు నితిన్. కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. దాంతో పాటు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. దానికితోడు కామెడీ కూడా పర్లేదు అనే స్థాయిలోనే ఉండటంతో ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఎమోషన్స్ కాస్త పండకపోవడం రంగ్ దే సినిమాకు మైనస్. కానీ ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త బెటర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే కావడంతో కలెక్షన్స్ కూడా దీనికే వస్తున్నాయి. తొలిరోజు ఈ సినిమాకు 5.43 కోట్ల షేర్ వచ్చింది. అయితే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే ఇదే దూకుడు మూడు నాలుగు రోజులు కొనసాగాలి.

నైజాం- 1.52 కోట్లు
సీడెడ్- 0.59 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.56 కోట్లు
ఈస్ట్- 0.52 కోట్లు
వెస్ట్- 0.31 కోట్లు
గుంటూరు- 0.67 కోట్లు
కృష్ణా- 0.21 కోట్లు
నెల్లూరు- 0.24 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 4.62 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.26 కోట్లు
ఓవర్సీస్- 0.55 కోట్లు

వరల్డ్ వైడ్ (టోటల్)- 5.43 కోట్లు

ఈ సినిమా సేఫ్ కావాలంటే 24 కోట్ల షేర్ వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం చూసుకుంటే మాత్రం రంగ్ దే అంత దూరం వెళ్లడం కష్టమే. కానీ ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఈ మధ్య కొన్ని సినిమాలు అలాగే కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఉప్పెన యావరేజ్ గానే ఉన్నా దానికి 50 కోట్లకు పైగా షేర్ ఇచ్చారు. మరి ఇప్పుడు రంగ్ దే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నితిన్ కెరియ‌ర్‌లో సెకండ్‌ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్..

ట్రెండింగ్‌

Advertisement