న్యూయార్క్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. న్యూయార్క్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. భారతీయ వంటకాల రుచులను చూపించే ఆ హోటల్‌కు సోనా అని పేరు పెట్టారు. భర్త, సింగర్ నిక్ జోనాస్ ఆ హోటల్‌కు సోనా అని పేరును ప్రతిపాదించినట్లు ప్రియాంకా చెప్పింది. అయితే ఆ హోటల్‌ను ప్రస్తుతం పబ్లిక్కు ఓపెన్ చేశారు. ఆ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రియాంకా తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇంగ్లండ్‌లో ఉన్న కారణంగా ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొనలేకపోయినట్లు చెప్పింది. భారత వంటకాలకు చెందిన రకరకాల రుచులు ఆ రెస్టారెంట్లో ఉంటాయని చోప్రా పేర్కొన్నది. టీమ్ ఎఫర్ట్స్తోనే ఆ హోటల్‌ను ప్రారంభించడం వీలైందని తెలిపింది. సోనా రెస్టారెంట్లో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో డిన్నర్ సర్వ్ చేయనున్నారు.