ఆదిపురుష్ : గ్రీన్ మ్యాట్తోనే సగానికి పైగా సినిమా
ఆదిపురుష్ | సినిమా షూటింగ్ అంతా దాదాపు గ్రీన్ మ్యాట్లోనే జరగబోతుందని తెలుస్తుంది. ఔట్ డోర్లకు కూడా తక్కువగానే వెళ్లబోతున్నారని తెలుస్తుంది.

ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు ఇండియన్ వైడ్‌గా ప్రేక్షకులు చూస్తుంటారు. అందుకే ఆయన సినిమాల కోసం బడ్జెట్ కూడా ఆలోచించడం లేదు నిర్మాతలు. ఆయన రాబోయే నాలుగు సినిమాల బడ్జెట్ రూ.1000 కోట్లు దాటిపోయింది అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాపై ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. అక్కడే ఈ సినిమా కోసం కొన్ని రోజులు ఉన్నాడు ప్రభాస్. అయితే ఆదిపురుష్ షూటింగ్ గురించి తాజాగా మరో క్రేజీ అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపు గ్రీన్ మ్యాట్లోనే జరగబోతుందని తెలుస్తుంది. ఔట్ డోర్లకు కూడా తక్కువగానే వెళ్లబోతున్నారని.. విజువల్ వండర్‌గా ఆదిపురుష్ ఉండబోతుందని తెలుస్తుంది.
ఫైట్స్ నుంచి మొదలుపెట్టి పాటలు, సీన్స్ అన్నీ విజువల్ గ్రాండియర్తోనే చూపించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఈయన గత సినిమా తానాజీ కంటే కూడా పదిరెట్లు గ్రాండ్‌గా ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుకుంటూ సినిమాను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. ఇప్పటి వరకు ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు.

ఈ మధ్యే హీరోయిన్ కృతి సనన్ కూడా జాయిన్ అయింది. త్వరలోనే ప్రభాస్, కృతి కాంబినేషన్లో ఓ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండే పాటను చిత్రీకరించబోతున్నాడు ఓం రౌత్.
ఇందులో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ చిత్ర షూటింగ్ 2021లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు. అలా అయితేనే పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం ఆర్నెళ్లు తీసుకుని 2022 ఆగస్టుకు విడుదల చేయగలరు.
అందుకే వీలైనంత త్వరగా ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నారు యూనిట్. ప్రభాస్ కూడా వాళ్లకు బాగానే సహకరిస్తున్నాడు.
ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని ప్రచారం జరుగుతుంది. అందులో 60 శాతం అంటే దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు.
ఇండియాలో ఇప్పటి వరకు చూడనటువంటి భారీ విజువల్ మైథలాజికల్ వండర్‌ను ఆదిపురుష్‌తో చూపించాలని ఫిక్స్ అయిపోయాడు ఓం రౌత్. ఈ క్రేజీ అప్ డేట్స్ బయటికి వస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వేదం నాగయ్య మృతి.. ప్రముఖుల సంతాపం
గత పదేళ్లలో దూరమైన సినీ ప్రముఖులు
నితిన్ కెరియర్లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్..
సిద్ధతో ఆచార్య.. మెగా క్రామేడ్స్ లుక్స్ అదుర్స్
అమెరికాలో రెస్టారెంట్ పెట్టిన ప్రియాంకా చోప్రా
వాయిదా పడ్డ గోపిచంద్ సీటీమార్
సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ .. నిజనిజాలేంటో చెప్పిన కమెడీయన్
హిందీలో మాట్లాడిన యాంకర్‌ను ట్రోల్ చేసిన ఏఆర్ రెహమాన్
మాట మార్చిన బన్నీ కూతురు .. వైరల్‌గా మారిన వీడియో
రెస్టారెంట్ వద్ద విజయ్‌దేవరకొండ, రష్మిక..ఫొటోలు హల్చల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

