బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం బీబీ3 (వర్కింగ్ టైటిల్). కర్ణాటకలోని దండేలి అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. బాలయ్య, ప్రగ్యాజైశ్వాల్ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ విరామంలో ప్రకృతి ఒడిలో సేద తీరింది ప్రగ్యాజైశ్వాల్. కాసేపు ఇక్కడ నేను ఉండేలా..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
పొట్టి డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా నది ఒడ్డున ఊయలలో కూర్చున్న స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తున్న స్టిల్స్ ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఇంటర్వెల్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట. మేలో థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం.