కెజియఫ్ 2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం అన్ని భాషల ఆడియన్స్ వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కన్నడలో అయితే నభూతో నభవిష్యతీ అన్నట్లుగా ఈ చిత్ర బిజినెస్ జరుగుతుంది. ఒకప్పుడు 40 కోట్ల బిజినెస్ అంటేనే నోరెళ్లబెట్టే వాళ్లు ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం 200 కోట్లకు పైగానే లెక్కలు చెబుతున్నారు. కెజియఫ్ తొలి భాగం 100 కోట్లకు పైగా వసూలు చేసింది కన్నడలో. మిగిలిన అన్ని భాషల్లో కలిపి దాదాపు 200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు రెండో భాగం బిజినెస్ కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న రేట్స్ విని బయ్యర్లకు భయం పుడుతుందని తెలుస్తుంది. కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారు.
అక్కడ యశ్ స్టార్ హీరో.. సొంత సినిమా కాబట్టి అంత వస్తుందేమో..? కానీ తెలుగులో కూడా కెజియఫ్ 2 కోసం ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజమైతే అంతకంటే సంచలనం మరోటి ఉండదు. ఎందుకంటే కెజియఫ్ తొలిభాగం 5 కోట్లకు సొంతం చేసుకుంటే.. 13 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. రెండో భాగంపై ఉన్న అంచనాల దృష్ట్యా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా అంత రేట్ అంటే మాత్రం నిజంగానే సంచలనం. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో 80 కోట్ల వరకు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి.
కెజియఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా 250 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మాత్రం కెజియఫ్ 2 బిజినెస్ భారీగానే జరుగుతుంది. ఈ విషయంలో నిర్మాతలు కాస్త ఆశ కూడా చూపిస్తున్నారని.. అది అత్యాశ వరకు వెళ్లకపోతేనే బాగుంటుందని సలహాలు కూడా అందుతున్నాయి. మరోవైపు ఈ చిత్రం విడుదల తేదీపై కూడా ఇప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను జులై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఎక్కువ రోజులు కూడా పోస్ట్ పోన్ చేయకూడదని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతా సిద్ధంగానే ఉండటంతో సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. అన్నీ కుదిర్తే సెప్టెంబర్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!