Hyderabad Police | తెలంగాణవ్యాప్తంగా నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడు నిమజ్జన ప్రక్రియ దశలో వారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గణేశ్ శోభాయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పాటలు మార్మోగిపోతుండగా.. భక్తులు, యువత కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ చెప్పారు.
ఓ వైపు ట్యాంక్‌బండ్‌పై కేసీఆర్ పాటలు మార్మోగుతుండటం.. మరోవైపు పోలీసులు వారికి వార్నింగ్ ఇస్తున్న వీడియోలు కూడా వచ్చాయి. అయితే కేసీఆర్ పాటల మేనియా పోలీసులను కూడా వదల్లేదు. నిమజ్జన శోభాయాత్రలో హైదరాబాద్ పోలీసులు ‘నడువు నడువు నడువవే రామక్క.. గులాబీల జెండలే రామక్క’ పాటకు డ్యాన్స్ చేశారు. నగరంలో ఓ గణేశుడి వద్ద కేసీఆర్ పాటలకు పోలీసులు తమ పని ఒత్తిడిని మరిచిపోయేలా స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కేసీఆర్ పాటకు డ్యాన్స్ వేసిన పోలీసులు https://t.co/2EbutymuwT pic.twitter.com/dyMOPDLI0o
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026