ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ : పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రమోషన్
రామ్ చరణ్ | 8 ఏళ్ల కింద ఈయన హీరోగా జంజీర్ సినిమా వచ్చింది. అయితే అది నిరాశ పరచడంతో మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్లలేదు రామ్ చరణ్.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ ఒక్కడే. బాహుబలి, సాహో సినిమాలతో ఆ ఇమేజ్ సంపాదించుకున్నారు ఆయన. ఇప్పుడు చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. ఈ జనరేషన్ లో అందరికంటే ముందు హిందీలో అడుగు పెట్టాడు చరణ్. 8 ఏళ్ల కింద ఈయన హీరోగా జంజీర్ సినిమా వచ్చింది. అయితే అది నిరాశ పరచడంతో మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్లలేదు రామ్ చరణ్. అయితే ఇన్నాళ్లకు ఆయన తన కెరీర్‌కు పక్కా స్కెచ్చులు వేసుకుంటున్నాడు.
ఇప్పుడు నేరుగా బాలీవుడ్ సినిమా కాకుండా పాన్ ఇండియన్ కథలతో ముందుకెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. ఆచార్య పక్కన బెడితే హీరోగా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు బాలీవుడ్‌లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంది. కారణం రాజమౌళి దర్శకుడు కావడమే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్.

ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. వరసగా ఇద్దరు అగ్ర దర్శకులు.. పాన్ ఇండియన్ వైజ్ మార్కెట్ ఉన్న దర్శకులతో సినిమాలు సెట్ చేసుకుని తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు మెగా వారసుడు. ఈయన ప్లానింగ్ కూడా అలాగే ఉంది.
ముందు ట్రిపుల్ ఆర్తో అక్కడ గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత శంకర్ సినిమాతో పాగా వేయాలని చూస్తున్నాడు. శంకర్ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు.. కేవలం పొలిటికల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతోనే తన రేంజ్ పెంచుకుని.. నెక్ట్స్ లెవల్ కు వెళ్లాలని చూస్తున్నాడు మెగా వారసుడు. శంకర్, రాజమౌళి సినిమాల తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ సినిమా కోసం చిరంజీవి వెయిటింగ్.. కారణం ఇదే
ఇర్ఫాన్ ఖాన్ దుస్తుల్లో ఫిల్మ్‌ఫేర్‌కు బాబిల్‌ఖాన్
దండేలి అడవుల్లో ప్రగ్యాజైశ్వాల్ ఏం చేస్తుందంటే..?
విమర్శల గురించి బాధపడొద్దు: ఇలియానా
అరణ్య 2 డేస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు రానా
నేను పాగల్‌ను అనుకుంటారు: విశ్వక్ సేన్
కొత్త డైరెక్టర్ తో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్..!
పింక్ డ్రెస్ లో తమన్నా తళుక్కులు..ఫొటోలు వైరల్
సెకండ్ వేవ్‌తో భయపడుతున్న పాన్ ఇండియా సినిమాలు
హీరోపై చీటింగ్ కేసు.. బెయిల్ ఇవ్వొద్దంటూ డిమాండ్
18 ఏళ్ల గంగోత్రి.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్
నిరాశపరిచిన చావు కబురు చల్లగా.. గీతా ఆర్ట్స్ 2లో డిజాస్టర్
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
ప్రకృతి అందాల నడుమ హాట్ హాట్‌గా క్యూటీ భామ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

