e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Aakashavani Trailer | గిరిజ‌నుల క‌థ‌తో స‌స్పెన్స్ గా 'ఆకాశ‌వాణి' ట్రైల‌ర్

Aakashavani Trailer | గిరిజ‌నుల క‌థ‌తో స‌స్పెన్స్ గా ‘ఆకాశ‌వాణి’ ట్రైల‌ర్

స‌ముద్ర‌ఖ‌ని (Samuthirakani), విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ చిత్రం ఆకాశ‌వాణి (Aakashavani). అశ్విన్ గంగ‌రాజు (Ashwin Gangaraju) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ ను ప్ర‌భాస్ (Prabhas) విడుద‌ల చేశాడు. ఒకానొక స‌మ‌యంలో..ఎక్క‌డో దూరంగా అంటూ వ‌చ్చే సంభాష‌ణ‌ల‌తో ట్రైల‌ర్ మొద‌లైంది.

మూఢనమ్మకం, అణచివేత మ‌ధ్య న‌లిగిపోయే అమాయ‌కులైన గిరిజ‌నుల జీవితాల‌ను రేడియో సెట్ ఎలా మారుస్తుంద‌నే క‌థ‌తో స‌స్పెన్స్ గా, క్యూరియాసిటీని క‌లిగించేలా సాగుతున్న ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది. ఎంఎం కీర‌వాణి త‌న‌యుడు కాల భైర‌వ అందించిన మ్యూజిక్ సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినివ్వ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ తో తెలిసిపోతుంది.

- Advertisement -

సాయి మాధ‌వ్ బుర్రా రాసిన సంభాష‌ణ‌లు, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ సినిమాకు మ‌రో స్థాయికి తీసుకెళ్లాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏయూ, ఐ స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

Viral Video | కొండ‌కోన‌ల్లో దారి త‌ప్పిన న‌టుడు.. గుర్తుప‌ట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు

Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెష‌ల్ షో వైర‌ల్

Gautham Menon | డాన్ లో మెరువ‌నున్న స్టార్ డైరెక్ట‌ర్..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement