e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News సొంతింటి కోసం అక‌స్మాత్‌గా పెరిగిన డిమాండ్‌!

సొంతింటి కోసం అక‌స్మాత్‌గా పెరిగిన డిమాండ్‌!

సొంతింటి కోసం అక‌స్మాత్‌గా పెరిగిన డిమాండ్‌!

న్యూఢిల్లీ: గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇండ్ల విక్ర‌య‌ల్లో అక‌స్మాత్ పెరుగుద‌ల న‌మోదైంద‌ని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మ‌న్ దీప‌క్ ప‌రేఖ్ పేర్కొన్నారు. ఇది తాత్క‌లికంగా వ‌చ్చిన డిమాండ్ కాద‌ని, సంస్థాగ‌తంగా వ‌చ్చిన డిమాండ్ అని.. ఇదిలాగే ఉండిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

వ‌న్ వ‌ర‌ల్డ్‌-వ‌న్ రియాల్టీ గ్లోబ‌ల్ ప్రోప్ టెక్ స‌మ్మిట్ 2021లో దీప‌క్ ప‌రేఖ్ గురువారం మాట్లాడుతూ 44 ఏండ్లుగా హౌసింగ్ సెక్టార్‌లో ప‌ని చేస్తున్న త‌న ముందుకు ఇప్ప‌టివ‌ర‌కు ఇటువంటి డిమాండ్ రాలేద‌న్నారు. ఇటీవ‌లి కాలంలో సొంతిండ్ల కోసం ప్ర‌య‌త్నించే వారి సంఖ్య అక‌స్మాత్‌గా పెరిగింద‌న్నారు.

తక్కువ వ‌డ్డీరేట్ల‌పై బ్యాంకులు ఇంటి రుణాలివ్వ‌డం కూడా సొంతిండ్ల కొనుగోళ్ల‌కు డిమాండ్ పెరుగుతుంద‌ని దీప‌క్ ప‌రేఖ్ చెప్పారు. సానుకూలం లేదా సుస్థిర‌మైన ఆస్తుల ధ‌ర‌లు, ఇండ్ల రుణాల‌పై ద్ర‌వ్య బెనిఫిట్లు కొన‌సాగించ‌డం కూడా క‌లిసి వ‌చ్చింద‌న్నారు.

సొంతింటి కోసం అక‌స్మాత్‌గా పెరిగిన డిమాండ్‌!

తొలిసారి ఇండ్ల కొనుగోలుదారులు, వ‌ర్క్ ఫ్రం హోం కింద సేవ‌లందించ‌డానికి అవ‌స‌ర‌మైన‌ పెద్ద ఇల్లు కొనుగోలు చేయాల‌ని భావిస్తున్న వారి నుంచి డిమాండ్ పెరుగుతూ వ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల క్షీణించిన ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి కోలుకుంటున్న ద‌శ‌లో అన్ని దేశాల సెంట్ర‌ల్ బ్యాంకులు ద్ర‌వ్య ల‌భ్య‌త‌కు ప‌లు విధానాలు అమ‌లు చేస్తున్నాయి.

ప‌లు దేశాల ప్ర‌భుత్వాలు ప్ర‌స్తుత రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డులు పెంచ‌డంపై ద్రుష్టిని కేంద్రీక‌రించాయి. ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌కుండా స్థిర‌మైన రిక‌వ‌రీని ఖ‌రారు చేస్తూ భ‌వ‌న నిర్మాణం సాగించ‌డం ఒక మార్గం. భ‌వ‌న నిర్మాణ రంగంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న వ‌ల్ల ప‌లు రెట్లు ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయి. ఇది ఎకాన‌మీపై బ‌హుళ రెట్లు సానుకూల ప్ర‌భావం ఉంటుంది.

దేశంలో ఫిన్ టెక్‌, హెల్త్ టెక్‌, ఎడ్యుటెక్‌, రెగ్‌-టెక్ గురించి చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ప్రాప‌ర్టీ టెక్నాల‌జీ లేదా ప్రాప్‌-టెక్ అంటే ఇంకా శైశ‌వ ద‌శ‌లోనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్మాణ రంగం డిజిట‌లైజ్ అయ్యింది. కానీ భార‌త్‌లో రియల్ ఎస్టేట్ రంగం త‌న రెవెన్యూలో 1.5 శాతం మాత్ర‌మే డిజిట‌లైజేష‌న్ కోసం కేటాయిస్తున్న‌ది.

సాధార‌ణంగా మ‌హిళ‌ల‌కు బంగారం కొనుగోలు చేయ‌డంపైనే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళ‌లు ఎక్కువ‌గా సొంతిండ్లను కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఇటీవ‌ల ప్రాప‌ర్టీ క‌న్స‌ల్టెంట్ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలు, అధ్య‌య‌నాల్లో తేలింది.

ఇవి కూడా చదవండి:

క‌రోనా కేసుల్లో వ‌ర‌ల్డ్ రికార్డు..

18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

డోంట్‌ వర్రీ..ఆన్‌ లైన్లో ఆక్సిజన్‌ మిషన్లు

అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

ర‌ష్యా తురుపుముక్క లెనిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

హాస్పిటల్‌ నుంచి 1,710 కొవిడ్‌ వ్యాక్సిన్లు మాయం

వ‌ణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్‌.. ఎందుకంత డేంజ‌ర్‌? ఏం చేయాలి?

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..

నెగెటివ్‌ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్‌కే

‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది

దేశంలో ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌


కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!

అస‌లు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజ‌న్‌, వ్యాక్సినేష‌న్‌పై కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

వ్యాక్సిన్ విధానాన్ని త‌ప్పుప‌ట్టిన సోనియా గాంధీ

తులం బంగారం 4 నెల‌ల్లో రూ.50వేలకు.. ప‌రిస్థితి విష‌మిస్తే.. మరింత పైపైకి!

Advertisement
సొంతింటి కోసం అక‌స్మాత్‌గా పెరిగిన డిమాండ్‌!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement