e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News Home Renovation| ఇంటి మ‌ర‌మ్మ‌త్తుకు లోన్‌పై ప‌న్ను మిన‌హాయింపులు ఇలా..

Home Renovation| ఇంటి మ‌ర‌మ్మ‌త్తుకు లోన్‌పై ప‌న్ను మిన‌హాయింపులు ఇలా..

Home Renovation| ఇంటి మ‌ర‌మ్మ‌త్తుకు లోన్‌పై ప‌న్ను మిన‌హాయింపులు ఇలా..

న్యూఢిల్లీ: ఇంటి రుణాల‌పై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని చాలా మందికి తెలుసు. కానీ ఇంటి మ‌ర‌మ్మ‌తు ప‌నులకు కూడా తీసుకున్న రుణాల‌కూ ఐటీ శాఖ ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తుంద‌న్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు..

ఇలా బ్యాంకులు స్పెష‌ల్ రుణాలు

ఇంటి య‌జ‌మానులు త‌మ ఇండ్ల‌కు పెయింటింగ్‌, రీఫిట్మెంట్‌, రీ ఫ్లోరింగ్ లేదా అద‌న‌పు రూమ్‌.. నిర్మించ‌డానికి బ్యాంకులు స్పెష‌ల్ రుణాలు ఆఫ‌ర్ చేస్తున్నాయి. ఇండ్ల మ‌ర‌మ్మ‌తు లేదా న్యూ బాల్కానీ, కొత్త రూమ్‌, ఫ్లోర్ నిర్మాణానికి అనుమ‌తి ఉన్నా స‌రే హోం ఇంప్రూవ్‌మెంట్ లోన్ తీసుకోవ‌చ్చు.

ఇండ్ల మ‌ర‌మ్మ‌త్తులు ఇలా

- Advertisement -

పెయింటింగ్‌, రీ ఫ్లోరింగ్‌, బాత్‌రూమ్ లేదా కిచెన్ మార్పులు, ప్లంబింగ్ వ‌ర్క్‌లు చేప‌ట్టేందుకు రుణాలు తీసుకునేందుకు అనుమ‌తిస్తాయి. ఆ రుణాల వ‌డ్డీపై ఐటీ శాఖ మిన‌హాయింపులు ఇస్తుంది. స్విమ్మింగ్ పూల్ వంటి విలాస‌వంత‌మైన విభాగాల నిర్మాణానికి మాత్రం టాక్స్ డిడ‌క్ష‌న్లు వ‌ర్తించ‌వు.

క‌నుక హోం ఇంప్రూవ్‌మెంట్ పేరిట తీసుకునే రుణాల‌పై చెల్లించే వ‌డ్డీ రూ.30 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు ఉన్నాయి. ఆదాయం ప‌న్ను చ‌ట్టం-1961లోని 24 సెక్ష‌న్ కింద ఇంప్రూవ్‌మెంట్ లోన్ వ‌డ్డీపై డిడ‌క్ష‌న్ వ‌ర్తిస్తుంది.

రెండో ఇంటికైనా రూ.30వేల వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు

రెండో ఇంటి కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వ‌డ్డీ మీద కూడా రూ.30 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే, మీరు తీసుకున్న ఇంటి రుణంపై వాయిదాలు చెల్లిస్తూ ఉంటే మాత్రం మొత్తం వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది.

జాయింట్ లోన్ తీసుకుంటే వేర్వేరు క్లెయిమ్‌లు

ఒక‌వేళ మీరు ఇంటి రుణంపై ఏటా రూ.1.20 ల‌క్ష‌ల వ‌డ్డీ చెల్లిస్తూ ఉంటే మాత్రం.. హోం ఇంప్రూవ్‌మెంట్ లోన్ వ‌డ్డీపై రూ.30 వేల వ‌ర‌కు గ‌రిష్ఠంగా మిన‌హాయింపు ల‌భిస్తుంది. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ జాయింట్ హోం ఇంప్రూవ్‌మెంట్ రుణం తీసుకుంటే వేర్వేరుగా రూ.30 వేల వ‌డ్డీ వ‌ర‌కు ప‌న్ను రాయితీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌దు.. అదీ త్వ‌ర‌లోనే: ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌

నార్కో టెర్ర‌ర్‌ను ఆపాలి: అమిత్ షా

క‌శ్మీర్‌ను లూటీ చేసేందుకే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు

నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్‌ మార్కెట్‌ మూసివేత

ల‌ఢాక్‌లో చొర‌బ‌డిన చైనా సైనికులు.. ద‌లైలామా బ‌ర్త్‌డే వేడుకల‌పై నిర‌స‌న‌

అంత‌రిక్షం నుంచి భూమిని చూడ‌డం అద్భుతం: శిరీష బండ్ల

భార్య గొంతెమ్మ కోరిక‌లు తీర్చ‌డం కోసం చైన్ స్నాచ‌ర్‌గా మారిన భ‌ర్త‌..!

గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు

వీడియో: స్కూల్‌ క్యాంటీన్‌లోకి ప్రవేశించిన చిరుత

వ‌రిగ‌డ్డితో చెప్పుల త‌యారీ.. ఎక్క‌డో తెలుసా?

తమిళనాడును విభజించే యోచనలేదు: బీజేపీ

సెప్టెంబర్ 12న నీట్ (యూజీ) పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Home Renovation| ఇంటి మ‌ర‌మ్మ‌త్తుకు లోన్‌పై ప‌న్ను మిన‌హాయింపులు ఇలా..
Home Renovation| ఇంటి మ‌ర‌మ్మ‌త్తుకు లోన్‌పై ప‌న్ను మిన‌హాయింపులు ఇలా..
Home Renovation| ఇంటి మ‌ర‌మ్మ‌త్తుకు లోన్‌పై ప‌న్ను మిన‌హాయింపులు ఇలా..

ట్రెండింగ్‌

Advertisement