కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న దేశానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వార్నింగ్ ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రాబోతోందని ఐఎంఏ చెప్పడం గమనార్హం. ఇలాంటి సమయంలో అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఏం జరిగిందో మనకు తెలుసు. గతంలో మహమ్మారులను చూసినా తెలుస్తుంది. థర్డ్ వేవ్ తప్పదు. అయినా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు, ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా వేడుకలు చేసుకుంటున్నారు అని ఐఎంఏ ఒక ప్రకటనలో చెప్పింది.
టూరిజం, తీర్థయాత్రలు, మత సంబంధమైన వ్యవహారాలు అవసరమే కానీ.. వాటిని మరికొన్ని నెలలు ఆపవచ్చు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఇలాంటి వాటికి ప్రజలను అనుమతిస్తే వీళ్లే సూపర్ స్ప్రెడర్లుగా మారి కరోనా థర్డ్ వేవ్‌కు కారణమవుతారు అని ఆ ప్రకటనలో ఐఎంఏ హెచ్చరించింది. కొవిడ్ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించవచ్చని కూడా చెప్పింది. వచ్చే రెండు, మూడు నెలలపాటు ఎలాంటి అలసత్వం లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

