e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News క్రిప్టో ట్రేడింగ్‌పై నిషేధానికి ఎన్పీసీఐ నో..

క్రిప్టో ట్రేడింగ్‌పై నిషేధానికి ఎన్పీసీఐ నో..

క్రిప్టో ట్రేడింగ్‌పై నిషేధానికి ఎన్పీసీఐ నో..

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలతో ట్రేడింగ్‌పై నిషేధం విధించ‌డానికి డిజిట‌ల్ చెల్లింపు (యూపీఐ లావాదేవీ) లు నిర్వ‌హిస్తున్న నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిరాకరించింది. క్రిప్టో క‌రెన్సీలో లావాదేవీలు జ‌రుపాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని బ్యాంకులే తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. వివిధ బ్యాంకులు నిబంధ‌న‌ల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని తెలిపింది. క్రిప్టో క‌రెన్సీ చెల్లింపుల‌పై ప‌లు బ్యాంకులు ఆంక్ష‌లు విధిస్తున్న స‌మ‌యంలో ఎన్పీసీఐ నిర్ణ‌యం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

దాదాపు ఒక ఆరు బ్యాంకులు క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్‌తో సంబంధం ఉన్న మర్చంట్ల‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాల‌ని పేమెంట్ గేట్‌వేట్ ఆప‌రేట‌ర్ల‌ను ఆదేశించిన‌ట్లు తెలుస్తున్న‌ది. క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్ కోసం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ప‌ద్ద‌తుల్లో ఆన్‌లైన్‌లో క‌స్ట‌మ‌ర్లు నిధులు బ‌దిలీ చేయ‌కుండా ఈ బ్యాంకులు ఆంక్ష‌లు విధించాయి.

యూపీఏ, రూపే కార్డుల‌పై క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్ చెల్లింపుల మీద అన్ని బ్యాంకులు ఆంక్ష‌లు విధిస్తే ఇన్వెస్ట‌ర్లు క్రిప్టో ట్రేడింగ్ జ‌రుప‌డానికి చాలా త‌క్కువ అవ‌కాశాలు ఉంటాయి. ఈ ప‌రిస్థితుల్లో క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్‌పై నిషేధం విధించ‌బోమ‌ని ఎన్పీసీఐ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని బ్యాంకులు క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్‌ను నిరాక‌రిస్తుండ‌గా, మ‌రికొన్ని బ్యాంకులు అనుమ‌తినిస్తున్నాయి. క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్‌పై దేశంలోని బ్యాంకుల మ‌ధ్య నెల‌కొన్న అనిశ్చితి ఎంత‌కాలం కొన‌సాగుతుంద‌న్న విష‌యం తేల‌లేదు.

కానీ, క్రిప్టో క‌రెన్సీలో ట్రేడింగ్‌కు వ‌స‌తులు క‌ల్పించాల‌ని గ‌తేడాది మార్చిలో సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. క్రిప్టో క‌రెన్సీల‌పై 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ విధించిన నిషేధాన్ని ప‌క్క‌న‌బెడుతూ గ‌తేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల‌ నేప‌థ్యంలో క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్‌పై నిషేధం విధించ‌లేమ‌ని ఎన్పీసీఐ పేర్కొన్నది. దేశ అత్యున్నత న్యాయ‌స్థానం ఆదేశాల త‌ర్వాత ఆర్బీఐ ఎటువంటి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయ‌లేదని, క‌నుక క్రిప్టో క‌రెన్సీల‌లో ట్రేడింగ్‌ను బ్లాక్ చేయ‌బోమ‌ని ఎన్పీసీఐ తెలిపింది.

సుప్రీంకోర్టు రూలింగ్ త‌ర్వాత కూడా బ్యాంకులు క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్‌పై చెల్లింపులను నిలిపివేయ‌లేవ‌ని డిజిట్ ఎక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఆశీశ్ మెహ‌తా వ్యాఖ్యానించారు. క్రిప్టో క‌రెన్సీల క్ర‌య‌, విక్ర‌య‌దారుల‌కు సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణంతో కూడిన మార్కెట్ క‌ల్పించాల్సిన బాధ్య‌త ఎక్స్చేంజీల‌కు, స‌ర్వీస్ ప్లాట్‌పామ్‌ల‌కు ఉంద‌న్నారు.

క్రిప్టో కరెన్సీల‌ను నేరుగా విక్ర‌యించ‌డానికి గానీ, కొనుగోలు చేయ‌డానికి గానీ లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో క్రిప్టో క‌రెన్సీల ట్రేడింగ్‌కు మ‌ద్ద‌తులో జాప్యం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పైనే ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌నున్న‌ది.

స్టాక్‌, ఫారెక్స్‌, క‌మొడిటీ ట్రేడింగ్‌లో ప‌రిమితంగా ఐఎంపీఎస్‌, ఆర్టీజీఎస్‌, నెఫ్ట్ వంటి ఆప్ష‌న్ల‌తో నిధుల బ‌దిలీకి అవ‌కాశాలు ఉన్న‌ప్పుడు సంబంధిత ఖాతాదారులు క్రిప్టో క‌రెన్సీల‌ను అనుమ‌తించే బ్యాంకుల‌కు మార‌తారు. క్రిప్టో ట్రేడింగ్‌కు అనుమ‌తించ‌క‌పోతే ఇన్వెస్ట‌ర్ల ఆస్తుల క్ర‌య‌, విక్ర‌యాలు క‌ష్టం అవుతాయి.

ఇవి కూడా చదవండి:

క‌రోనా ఎఫెక్ట్ : ఉద్యోగుల‌కు వేత‌నంతో కూడిన సెల‌వ‌లు, వారానికి నాలుగు రోజుల ప‌ని!

ఎంపీ తేజ‌స్విని క‌స‌బ్‌తో పోల్చిన యాక్ట‌ర్ సిద్దార్థ్‌

కెన‌డాలో కొత్త ఇమ్మిగ్రేష‌న్ విధానం.. భార‌తీయుల‌కే ఎక్కువ ప్ర‌యోజ‌నం

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల బ్లాక్ మార్కెట్ రాకెట్ ర‌ట్టు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

ప్రైవేటీకరణకు మరో బ్యాంకు రెడీ..

మారుతి ఉత్పత్తి కోత

బ్రీఫ్‌కేస్‌ పరిమాణంతో వెంటిలేటర్‌

ఇక ఒక్క‌రోజులోనే డేట్..మీట్..చాట్!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్రిప్టో ట్రేడింగ్‌పై నిషేధానికి ఎన్పీసీఐ నో..

ట్రెండింగ్‌

Advertisement