కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానంతో దాదాపు 90 వేల మంది వలసదారులను శాశ్వత నివాసితులుగా చేయనున్నది.

టోరంటో : కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ విధానంతో దాదాపు 90 వేల మంది వలసదారులను శాశ్వత నివాసితులుగా చేయనున్నది. ఈ విధానం వల్ల భారతీయులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంటున్నారు.
కొత్త ఇమ్మిగ్రేషన్ కార్యక్రమం కింద కెనడాలో ఇప్పటికే నివసిస్తున్న 90 వేలకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక అవసరమైన ఉద్యోగులకు శాశ్వత నివాస (పీఆర్) హోదా ఇవ్వనున్నారు. శాశ్వత నివాస హోదా ఇవ్వడానికి 40 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు, 30 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు, ఆరోగ్య రంగానికి చెందిన 20 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు.
కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులు గత నాలుగేండ్లలో అదే దేశంలో పోస్ట్ సెకండరీ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లయితే శాశ్వత నివాసితులుగా గుర్తింపు పొందుతారు. కెనడాలో ఆరోగ్య రంగంలో లేదా ఇతర అవసరమైన పనుల్లో విదేశీ ఉద్యోగులకు కనీసం ఒక ఏడాది అనుభవం కలిగి ఉండాలి. కెనడాలో భారతీయ వలసదారుల సంఖ్య 2020 లో 2,20,000 గా ఉన్నందున ఇతర విదేశీ విద్యార్థుల కంటే భారతీయ విద్యార్థులు ఈ ప్రోగ్రాం నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు.
కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయే ముందు 2020 లో 3,41,000 మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా ఇచ్చేందుకు కెనడా నిర్ణయించింది. గత ఏడాది ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారు.దాంతో ఈ సంవత్సరం నాలుగు లక్షల మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా ఇవ్వనున్నారు.
ఈ విధానం కెనడాలో వలసదారులు తమ మూలాలను స్థాపించుకోవడానికి, కెనడాకు కూడా ఎదగడానికి అవకాశం కల్పిస్తుందని కెనడియన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్కో మెండిసినో చెప్పారు. వలసదారుల స్థితి తాత్కాలికమే అయినా, వారి సహకారం అంతులేనిదని, అందువలన వారు ఇక్కడే ఉండాలని మేం కోరుకుంటున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్లో బీజేపీ ఓటమికి బాధ్యులు విజయవర్గీయ, ఘోష్ : తథాగతరాయ్
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
రెజ్లర్ సుశీల్‌పై హత్య కేసు.. ఛత్రసాల్ స్టేడియంలో ఘర్షణ
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
కరోనాతో నటి అభిలాషా పాటిల్ కన్నుమూత
మే 15 వరకు బీహెచ్‌యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

