బెంగాల్లో బీజేపీ ఓటమికి బాధ్యులు విజయవర్గీయ, ఘోష్ : తథాగతరాయ్
పశ్చిమ బెంగాల్లో బీజేపీలో అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. ఓటమికి నువ్వంటే నవ్వు కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీలో అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. ఓటమికి నువ్వంటే నవ్వు కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు తథాగతరాయ్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తిగా విజయవర్గీయ, ఘోష్లదే అని కుండబద్దలు కొట్టారు.
ఎన్నికల సమయం వరకు బెంగాల్లో బీజేపీ బలమైన పార్టీగా నిలిచిందని తథాగత రాయ్ చెప్పారు. అయితే, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, బీ ఫారంలు అందజేయడం కైలాష్ విజయవర్గియా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ లే చూడటం వల్ల చెత్త అభ్యర్థులు బరిలో నిలువాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఓటమి ముమ్మాటికి విజయవర్గీయ, ఘోష్లదే కానీ, నరేంద్ర మోదీ, అమిత్‌షాలది మాత్రం కాదన్నారు. వీళ్లిద్దరే మోదీ, అమిత్ షాను బురదలోకి లాగి పరువు తీశారని అన్నారు.
వీరిద్దరూ బెంగాల్ లోని స్టార్ హోటళ్ళలో కూర్చుని తృణమూల్ నుండి వచ్చిన చెత్తకు టిక్కెట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు దాడులు చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారే కానీ బీజేపీ కార్యకర్తలను ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకు అండగా నిలువాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
రెజ్లర్ సుశీల్‌పై హత్య కేసు.. ఛత్రసాల్ స్టేడియంలో ఘర్షణ
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
కరోనాతో నటి అభిలాషా పాటిల్ కన్నుమూత
మే 15 వరకు బీహెచ్‌యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

