e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News నియంత్ర‌ణ కోల్పోయిన చైనా రాకెట్‌.. ఎక్క‌డ కూలుతుందోన‌ని ఆందోళ‌న‌

నియంత్ర‌ణ కోల్పోయిన చైనా రాకెట్‌.. ఎక్క‌డ కూలుతుందోన‌ని ఆందోళ‌న‌

నియంత్ర‌ణ కోల్పోయిన చైనా రాకెట్‌.. ఎక్క‌డ కూలుతుందోన‌ని ఆందోళ‌న‌

బీజింగ్ : చైనాకు చెందిన రాకెట్ ఒక‌టి అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయింది. ఈ రాకెట్ భూమిపై వినాశనం కలిగించవచ్చున‌ని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అయితే, అమెరికా-చిలీ మధ్య కూలిపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్తలు చెప్తున్నారు.

ఇటీవ‌ల ప్ర‌యోగించిన‌ చైనీస్ రాకెట్ లాంగ్ మార్చ్ 5 బీ భూమికి తిరిగి వ‌చ్చేప్పుడు కూలిపోనున్న‌ద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ రాకెట్ ఈనెల 8 న భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చని ప‌రిశోధ‌కులు లెక్క‌లు వేస్తున్నారు. అయితే, 21-టన్నుల బ‌రువున్న ఈ రాకెట్ మే 8 న ఎక్క‌డైనా భూ వాతావరణంలోకి ప్రవేశించవచ్చని అమెరికా ప్రభుత్వం హెచ్చరిక ప్ర‌క‌ట‌న‌ జారీ చేసింది. ఏ ప్రాంతంలో చెప్ప‌డం క‌ష్టం కానీ 8 వ తేదీన కూలిపోతుంద‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చ‌ని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మైక్ హోవార్డ్ తెలిపారు. చైనీస్ రాకెట్ స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. భూ వాతావరణంలోకి రావ‌డానికి కొన్ని గంటల ముందు మాత్రమే అది ఎక్కడ నుంచి వ‌స్తుందో తెలుస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

చైనా కెరీర్‌లో అతిపెద్ద రాకెట్

గత వారం లాంగ్‌మార్చ్ 5 బీ రాకెట్‌ను చైనా తాను అంత‌రిక్షంలో నిర్మిచే అంతరిక్ష కేంద్రం.. టియాన్‌హే.. మొదటి బిల్డింగ్ బ్లాక్‌ను పంపడానికి ప్ర‌యోగించింది. చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లోని కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 5 బీ ద్వారా ఏప్రిల్ 29 న టియాన్‌హే ప్రారంభించారు. అంత‌రిక్షంలో అమెరికాతోపాటు ఇత‌ర దేశాల ఆధిప‌త్యాన్ని స‌వాల్ చేస్తూ సొంతంగా అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు చేసేందుకు చైనా టియాన్‌హేను నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది.

చివరిసారి లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ ప్ర‌యోగం స‌మ‌యంలో దాని నుంచి పెద్ద లోహపు కడ్డీలు బయటకు వచ్చి ఐవరీ కోస్ట్‌లో ప‌డిపోవ‌డంతో ప‌లు భవనాలు దెబ్బతిన్నాయనిచ‌ చాలా రాడ్లు ఆకాశంలో కాలిపోగా ఇంకొన్ని భూమిపై పడ్డాయని అంతరిక్ష నిపుణుడు జోనాథన్ మెగ్డోబల్ చెప్పారు. ప్ర‌స్తుతం చైనీస్ రాకెట్‌ న్యూయార్క్, మాడ్రిడ్ నుంచి ద‌క్షిణాన చిలీ లేదా న్యూజిలాండ్ నుంచి భూ వాతావ‌ర‌ణంలోకి ప్రవేశించవచ్చని ఆయన అన్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రాకెట్‌ గత కొన్ని రోజులుగా అనిశ్చితంగా భూమి వైపు కదులుతున్న‌ది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన నియంత్రణ‌ రాకెట్ ఇదే. ప్రస్తుతానికి ఇది ఒక చిన్న విమాన ప్రమాదమే కావచ్చు, కానీ రద్దీగా ఉన్న ప్రాంతంలో పడితే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ప‌రిశోధ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఒకే కాన్పులో 9 మంది జ‌న‌నం.. మాలిలో ఘ‌ట‌న‌

ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌

చైనాలో ఉయ్గార్ ముస్లింలపై దారుణాల‌కు వ్యతిరేకంగా న్యూజిలాండ్ పార్లమెంటు ప్రతిపాదన

బుద్గాంలో డీఆర్‌డీఓ 500 పడకల ద‌వాఖాన

టీకా వృథా త‌గ్గేలా చేస్తున్న కేర‌ళ‌కు ప్ర‌ధాని ప్ర‌శంస‌లు

భార‌త్‌లో అమెరికా కొత్త రాయ‌బారిగా లాస్ ఏంజిల్స్ మేయ‌ర్‌..?

హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ ద‌వాఖాన‌లు

ఓట‌మితో మ‌మ‌తకు సీఎంగా నైతిక హ‌క్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్‌

యాహూతో గూగుల్‌ను స‌వాల్ చేయాల‌ని మైక్రోసాఫ్ట్ ప్లాన్‌..?!

ఫుట్‌పాత్‌పై ర‌స‌ర‌మ్య సంగీత‌ బాణీలు.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నియంత్ర‌ణ కోల్పోయిన చైనా రాకెట్‌.. ఎక్క‌డ కూలుతుందోన‌ని ఆందోళ‌న‌

ట్రెండింగ్‌

Advertisement