e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌

ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌

ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌

న్యూఢిల్లీ : ఎలోన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్, స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవకు మంచి ఓపెనింగ్ లభించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ బ్రాడ్ బ్యాండ్ సేవ కోసం దాదాపు 50 లక్షల మంది రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నారు. ఎలోన్ మస్క్ ఫాస్ట్ స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ రిజిస్ట్రేష‌న్లు భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఇప్ప‌టికే ప్రారంభమైంది. వినియోగదారులు 99 డాల‌ర్లు (దాదాపు రూ.7,300) చెల్లంచ‌డం ద్వారా ఆన్‌లైన్‌లో పేర్ల‌ను నమోదు చేసుకోవచ్చు.

ఎలోన్ మ‌స్క్ స్టార్‌లింక్ ఇంట‌ర్నెట్ స‌దుపాయం కోసం రిజిస్ట్రేష‌న్లు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. హై స్పీడ్‌తో ఉండే స్టార్‌లింక్ ఇంట‌ర్నెట్ స‌దుపాయం అందుబాటులోకి ఎప్పుడు వ‌స్తుందా అని వినియోగ‌దారులు ఎదురుచూస్తున్నారు. స్టార్‌లింక్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు చెల్లించే రిజిస్ట్రేష‌న్ మొత్తాన్ని క‌నెక్ష‌న్ అవ‌స‌రం లేద‌ని అనుకుంటే తిరిగి చెల్లించనున్నారు. స్టార్‌లింక్ సేవను స్పేస్‌ఎక్స్ అనే ఏరోస్పేస్ సంస్థ నిర్వహిస్తున్న‌ది. స్పేస్‌ఎక్స్ సంస్థ‌ను ఎలోన్ మ‌స్క్‌ 2002 లో స్థాపించారు. స్టార్‌లింక్‌ను వ‌చ్చే ఏడాది ఎప్పుడైనా భారతదేశంలో ప్రారంభించవచ్చు.

గ‌రిష్ఠ వేగం 300 ఎంబీపీఎస్‌

- Advertisement -

బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, స్టార్‌లింక్ ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ భారతదేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సేవ‌ల‌ను పొందాల‌నుకునే వారు త‌మ‌ చిరునామాను వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా వారి నివాస ప్రాంతంలో స్టార్‌లింక్‌కు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న‌దీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌ ప్రాజెక్ట్ గరిష్టంగా 50 నుంచి 150 ఎంబీపీఎస్‌ వేగం పొందుతుంది. అలాగే, 2021 చివరి నాటికి ఈ స్పీడ్ 300 ఎంబీపీఎస్‌కు పెరుగ‌నున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి..

చైనాలో ఉయ్గార్ ముస్లింలపై దారుణాల‌కు వ్యతిరేకంగా న్యూజిలాండ్ పార్లమెంటు ప్రతిపాదన

బుద్గాంలో డీఆర్‌డీఓ 500 పడకల ద‌వాఖాన

టీకా వృథా త‌గ్గేలా చేస్తున్న కేర‌ళ‌కు ప్ర‌ధాని ప్ర‌శంస‌లు

భార‌త్‌లో అమెరికా కొత్త రాయ‌బారిగా లాస్ ఏంజిల్స్ మేయ‌ర్‌..?

హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ ద‌వాఖాన‌లు

ఓట‌మితో మ‌మ‌తకు సీఎంగా నైతిక హ‌క్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్‌

యాహూతో గూగుల్‌ను స‌వాల్ చేయాల‌ని మైక్రోసాఫ్ట్ ప్లాన్‌..?!

ఫుట్‌పాత్‌పై ర‌స‌ర‌మ్య సంగీత‌ బాణీలు.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌
ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌
ఎలోన్ మస్క్ ఇంటర్నెట్‌కు బ‌ఫ‌ర్ ఒపెనింగ్స్‌

ట్రెండింగ్‌

Advertisement