e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home News ఫుట్‌పాత్‌పై ర‌స‌ర‌మ్య సంగీత‌ బాణీలు.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఫుట్‌పాత్‌పై ర‌స‌ర‌మ్య సంగీత‌ బాణీలు.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఫుట్‌పాత్‌పై ర‌స‌ర‌మ్య సంగీత‌ బాణీలు.. చ‌రిత్ర‌లో ఈరోజు

ముంబైలోని దాదర్ బ్రాడ్‌వే సినిమా ఎదుట ఉన్న‌ పేవ్‌మెంట్‌పై మ‌రిచిపోలేని సంగీత బాణీల‌ను అల్లి.. అనంత‌ర కాలంలో సినీ సంగీత సామ్ర‌ట్టుగా నిలిచిన నౌషాద్ అలీ 2006 లో ఇదే రోజున క‌న్నుమూశారు. లక్నో నుంచి పారిపోయి వ‌చ్చిన నౌషాద్‌కు ఫుట్‌పాతూ ఇళ్లు. ఇక్కడే తినడం, ఇక్క‌డే జీవించడం, ఇక్క‌డే సంగీత బాణీలు అల్ల‌డం చేసేవాడు. సినిమాల్లో సంగీతద‌ర్శ‌క‌త్వం చేయాల‌న్న ఆయ‌న క‌ల 1952 లో నెరవేరింది. నౌషాద్ సంగీతం ఇచ్చిన ‘బైజు బావ్రా’ అనే చిత్రం సూపర్ హిట్‌గా నిలువ‌డంతో ఆయ‌న పేరు మార్మోగింది. ఇక అప్ప‌టి నుంచి భార‌తీయ సినిమా నౌషాద్ గురించి మాట్లాడుకోవ‌డం ప్రారంభించింది.

లక్నోలోని ముస్లిం కుటుంబంలో 1919 డిసెంబర్ 25 న జన్మించిన నౌషాద్ ఇంట్లో సంగీతాన్ని నిషేధించారు. ఈ ఇంట్లో ఉండాల‌నుకుంటే సంగీతాన్ని వదిలివేయాల‌ని తండ్రి ఆంక్ష‌లు విధించారు. ఇవేమీ ప‌ట్టించుకోకుండా నౌషాద్ సంగీతం కోసం ఇంటిని విడిచిపెట్టాడు. కలల నగరమైన ముంబైకి చేరుకుని ఫుట్‌పాత్‌పై ఉంటూ సంగీతం నేర్చ‌కుంటూ జీవితాన్ని ప్రారంభించాడు. ఇక్కడ మాస్ట్రో జాండే ఖాన్ అతడిని చూసి తన‌తో తీసుకెళ్లి నెలకు రూ.40 వేతనానికి త‌న వ‌ద్ద నియమించుకున్నారు.

అనంత‌రం స్వరకర్త ఖేమ్‌చంద్ ప్రకాష్ అతడికి ‘కాంచన్’ చిత్రంలో అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడి నుంచి నౌషాద్ సినిమా ప్రయాణం మ‌రింత ఈజీగా త‌యారైంది. నౌషాద్‌కు 1940 లో తొలిసారిగా స్వరకర్తగా పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమా పేరు ‘ప్రేమ్ నగర్స‌. అయితే, ఈ సినిమా విడుదల కాలేదు. 1944లో ‘రతన్స‌ , 1954 లో ‘బైజు బావ్రాస మంచి పేరు తెచ్చిపెట్టాయి. బైజు బావ్రా సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. 1960 లో విడుద‌లైన మొఘ‌లే ఆజాం సినిమా ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తిప్ర‌తిష్ఠ‌ల‌ను తీసుకొచ్చింది. 2005 లో తాజ్‌మ‌హల్ సినిమాకు ప‌నిచేసిన నౌషాద్.. 1981 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2017: దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

2010: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ హరికోట అంతరిక్ష కేంద్రం నుంచి సౌండింగ్ రాకెట్ విమాన పరీక్ష విజయవంతం

2005: బ్రిటన్‌ మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన టోనీ బ్లెయిర్

1970: భారతదేశపు ప్రసిద్ధ షూటర్ సమరేష్ జంగ్ జననం

1961: అంతరిక్ష నౌక నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో దిగిన అమెరికా మొట్టమొదటి వ్యోమగామి కమాండర్ అలాన్ షెప్పర్డ్

1954: బీజేపీ నాయ‌కుడు, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ జననం

1953: భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌కేకే షణ్ముఖం చెట్టి కన్నుమూత‌

1937: పరమవీర్ చక్ర మేజర్ హోషియార్ సింగ్ జననం

1935: హిందీ-గుజరాతీ సాహితీవేత్త అబిద్ సుర్తి జననం

1929: భారతదేశపు ప్రసిద్ధ విప్లవకారులలో ఒకరైన అబ్దుల్ హమీద్ కైజర్ జననం

1916: భారత మాజీ రాష్ట్ర‌ప‌తి జ్ఞానీ జైల్ సింగ్ జననం

1903: స్వాతంత్ర్య సమరయోధుడు అవినాషలింగం చెట్టియార్ జననం

1818 : కార‌ల్ మార్క్స్ జ‌న‌నం

ఇవి కూడా చ‌ద‌వండి..

‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ

ఈ ఏడాది చివ‌ర్లో అందుబాటులోకి 5 జీ సేవ‌లు..?

ప‌డిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన విడాకులు.. ఇవే

భార‌త‌దేశం సేవ‌లు అజ‌రామ‌రం : హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
ఫుట్‌పాత్‌పై ర‌స‌ర‌మ్య సంగీత‌ బాణీలు.. చ‌రిత్ర‌లో ఈరోజు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement