ఇచ్చోడ, ఏప్రిల్ 17: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరోసారి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. నాలుగేండ్ల క్రితం కేసీఆర్, కేటీఆర్ జన్మదినాన్ని పురసరించుకొని 500 మామిడి మొకలు నాటి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేశారు. ప్రస్తుతం వాటికి కాయలు కాశాయి.
శుక్రవారం మామిడి తోటకు ‘కేసీఆర్- కేటీఆర్ ఆర్గానిక్ మామిడి తోట’ అని నామకరణం చేశారు. ఆ బ్రాండ్ పేరుతోనే ముద్రించిన కవర్లను ప్రతి మామిడి కాయకు తొడిగారు. తొలి కాయను కేసీఆర్ సార్, కేటీఆర్ అన్నకు ఇస్తామని మాజీ సర్పంచ్ మీనాక్షి తెలిపారు. కేసీఆర్ సార్ ఉంటేనే టింగు..టింగు మంటూ రైతు బంధు వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.