e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News భార‌త‌దేశం సేవ‌లు అజ‌రామ‌రం : హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్‌

భార‌త‌దేశం సేవ‌లు అజ‌రామ‌రం : హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్‌

భార‌త‌దేశం సేవ‌లు అజ‌రామ‌రం : హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్‌

భార‌త్‌లో కరోనా వైరస్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ద‌వాఖాన‌ల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందుల కొర‌త ఇబ్బంది పెడుతున్న‌ది. ఇలాంటి క్లిష్ట సమయంలో హార్వర్డ్ స్కూల్, పబ్లిక్ హెల్త్ ఆఫ్ అమెరికాలో ప్రొఫెసర్ డాక్టర్ జెస్సీ బంప్.. ప్ర‌పంచానికి టీకాలు అందిస్తూ భార‌త్ చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. వ్యాక్సిన్లు కొనుగోలు చేయ‌లేని నిరుపేద దేశాల‌కు సైతం అండ‌గా నిలువ‌డం భార‌త్ గొప్ప‌త‌న‌మ‌న్నారు. వారి సేవ‌లు అజ‌రామ‌రం అని కీర్తించారు.

ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రపంచవ్యాప్తంగా మెరుగుపరచడంలో దక్షిణాసియా దేశాలు ముఖ్యంగా భారతదేశం ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషించాయ‌ని, మనమందరం దీన్ని అంగీకరించి గౌరవించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది అని ఆయ‌న‌ చెప్పారు. దాదాపు 219 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం మశూచి బారిన పడింది. ఆ సమయంలో 3 నుంచి 5 కోట్ల మంది మరణించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ ప్రజలపై టీకాపై క్లినికల్ ట్రయల్ నిర్వహించింది. ఇది మొత్తం ప్రపంచానికి మేలు చేసింది అని ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్ తెలిపారు.

భార‌త‌దేశం సేవ‌లు అజ‌రామ‌రం : హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్‌

భారతదేశంలో వర్చువలైజేషన్ చరిత్ర పాత‌ద‌ని, వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి ప్రపంచమంతా సరైన సాంకేతికతను పొందటానికి కారణం ఇదే అని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్లు పొందిన‌వారంతా భార‌త్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశం జీ 77, నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్, సెరోతో కలిసి పనిచేసింద‌ని, ప్రపంచానికి గణితాన్ని, సున్నాను క‌నుగొన్నార‌ని, ఇందుకు ప్రపంచం నలుమూలల నుంచి భారతదేశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్ చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షం.. బుర‌ద‌లో కూరుకుపోయిన‌ ఇండ్లు

తొలి మ‌హిళా న్యాయ‌మూర్తి అన్నా చాందీ.. చరిత్ర‌లో ఈరోజు

భార‌త్‌కు వినోద్ ఖోస్లా 10 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

పంచాయ‌తీ విజ‌యం చూడ‌క‌ముందే ముగ్గుర్ని కాటేసిన క‌రోనా

లాక్‌డౌన్ విధించండి.. క్యాట్ స‌ర్వేలో ప్ర‌జ‌లు

ఈ నెల 10 న‌ విశ్వాస ప‌రీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి

గ్లేసియ‌ర్స్ క‌రిగి ఏర్ప‌డిన వేలాది స‌ర‌స్సులు.. శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌

ఆన్‌లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాష‌ల్లో సేవ‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భార‌త‌దేశం సేవ‌లు అజ‌రామ‌రం : హార్వ‌ర్డ్ ప్రొఫెస‌ర్ జెస్సీ బంప్‌

ట్రెండింగ్‌

Advertisement