Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ మద్దతు.. చర్చలు, విబేధాలతోనే ప్రజాస్వామ్యం బలోపేతమంటూ వ్యాఖ్య
Cockroach Janta Party : ఇటీవల సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) మద్దతు ప్రకటించింది. దేశంలో చర్చలు, విబేధాలు, విమర్శలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
Cockroach Janta Party : ఇటీవల సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) మద్దతు ప్రకటించింది. దేశంలో చర్చలు, విబేధాలు, విమర్శలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అయిన సునీల్ అంబేకర్ శనివారం ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
దేశంలో కొత్తగా వస్తున్న గొంతుకలకు, భిన్నాభిప్రాయాలకు, కొత్త రాజకీయ వేదికలకు భారత దేశ ప్రజాస్వామ్యం స్థానం కల్పించగలదన్నారు. భారత రాజకీయ సంస్కృతికి ప్రజాస్వామ్య భాగస్వామ్యం, బహిరంగ చర్చలు కీలక సాధనాలు అని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు తగిన అవకావం కల్పిస్తాయన్నారు. మీడియా, సోషల్ మీడియా కూడా ప్రజాస్వామ్యానికి అవకాశం కల్పిస్తాయని చెప్పారు. ఏ రకమైన చర్చ జరిగినా, ప్రజుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదని, ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగంగానే భావించాలని సునీల్ అంబేకర్ సూచించారు.
దేశ యువత గురించి కూడా ఆయన స్పందించారు. జెన్ జీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారనే నమ్మకం ఉందన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్మిస్తారని, దేశాభివృద్ధికి పాటుపడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, కాక్రోచ్ జనతా పార్టీకి ఇటీవల ఆన్లైన్లో ఎలాంటి ఆదరణ లభించిందో తెలిసిందే. పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కుమ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు వచ్చి చేరారు. మరోవైపు ఈ పార్టీ ఎక్స్ అకౌంట్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీజేపీపై విస్తృతంగా చర్చ మాత్రం జరుగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

