దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ‘జై హనుమాన్’ ఒకటి. బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రం ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. ‘కాంతార’ఫేం రిషబ్‌శెట్టి ఇందులో హనుమంతుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోకి రానా దగ్గుబాటి కూడా ఎంట్రీ ఇచ్చినట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే.. ఈ సినిమాలో రానా పోషిస్తున్న పాత్ర ఏంటి? అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇందులో రానా అశ్వత్థామగా నటిస్తున్నారు.
అశ్వత్థామ అనగానే అందరికీ ‘కల్కి 2898ఏడీ’ సినిమా గుర్తుకురావడం సహజం. అందులో అశ్వత్థామగా అమితాబ్ నటించారు. ఇప్పుడు అదే పాత్రను ‘జై హనుమాన్’లో రానా పోషిస్తుండటం ఆసక్తినిరేకెత్తిస్తున్న అంశం. పురాణాల ప్రకారం సప్త చిరంజీవుల్లో హనుమంతుడితోపాటు అశ్వత్థామ కూడా ఉంటారు. మరి ఈ కథలో అశ్వత్థామ నిర్వర్తించే బాధ్యత ఏంటి? అనేది తెలియాల్సివుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో మరికొందరు చిరంజీవుల పాత్రలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. వారెవరు? ఆ పాత్రలను ఎవరు పోషిస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.