Talasani Srinivas Yadav | కేసీఆర్ మళ్లీ రావాలి.. రాష్ట్రం మొత్తం ఇదే నినాదం మార్మోగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి పండపెట్టి తొక్కుతాం.. గోటీలు అడుతా అంటుండు.మిమ్మల్నిప్రజలు పండపెట్టి తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పార్టీలో కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు.కేసీఆర్ అద్భుతమైన పాలన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గౌరవాన్ని పెంచిందన్నారు.
గులాబీ జెండా శ్రీరామరక్ష.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. ధైర్యంగా ఉండండి.. పార్టీ మీకు అండగా ఉంటుంది. నిత్యం ప్రజల మధ్య ఉండండి.. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడండి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్జెండర్ ఇన్ఫ్లూయెన్సర్