Singapore Open : ప్రతిష్ఠాత్మక సింగపూర్ ఓపెన్‌లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి (Chirag Shetty) జైత్రయాత్ర కొనసాగుతోంది. పురుషుల డబుల్స్‌లో తిరుగులేని ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న ఈ జోడీ దర్జాగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 జోడీని మట్టికరిపించిన సాత్విక్ చిరాగ్ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తద్వారా భారత్‌కు పతకం ఖరారు చేసింది.
సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం పంజా విసిరింది. పీపీ సింధు, లక్ష్యసేన్ తేలిపోయిన చోట దేశానికి పతకం ఖాయం చేస్తూ ఫైనల్ బెర్తు పట్టేసింది. ప్రపంచ నంబర్ 1 కిమ్ వాన్ హొ – సియో సెయంగ్ జీ(దక్షిణ కొరియా) జంటను చిత్తగా ఓడించిన ఈ ద్వయం ఫైనల్లో అడుగు పెట్టింది.
Straight sets, pure dominance! 🔥
Satwik and Chirag storm into the FINALS of the Singapore Open 2026 after taking down the top seeds. The boys are unstoppable! 🇮🇳🏸 pic.twitter.com/o6qLUlOthm
— BAI Media (@BAI_Media) May 30, 2026
శనివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్‌లో ఆడింది. వరసగా రెండు సెట్లలో కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం 21-19, 21-18తో జయభేరి మోగించింది. కేవలం 52 నిమిషాల్లోనే ప్రత్యర్థిని కంగుతినిపించి కిమ్ – సియోపై తొలి విజయం నమోదు చేసింది. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఆదివారం జరుగనున్న టైటిల్ పోరులో సాత్విక్ – చిరాగ్ ద్వయం ఢీ కొట్టనుంది.
SatChi Into The Finals ✅️
Massive Victory For Satwik/Chirag . They Defeated Korean WR 1 Pair Kim Won Ho / Seo Seung Jae In Straight Games 21-19 , 21-18 . The Last Time The Korean Pair Lost A Match Was At The 2025 Denmark Open .
Final vs Alfian/Fikri 🇮🇩 (OR) Liang/Wang 🇨🇳 https://t.co/VcZBKAHLy0 pic.twitter.com/zp2ryhVL2T
— Badminton Media (@BadmintonMedia1) May 30, 2026