Bill gates Divorce |ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
మెలిండాకు విడాకులు ఇస్తున్నట్లు బిల్ గేట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన విడాకులు తీసుకున్న ఏడు జంటలు ఉన్నాయి. వారిపై ఓ లుక్కేద్దాం.

మెలిండాకు విడాకులు ( Divorce ) ఇస్తున్నట్లు బిల్ గేట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మెలిండా ( Melinda gates )ను వివాహం చేసుకున్న 27 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బిల్ మెలిండ్ గేట్స్ ఫౌండేషన్‌లో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని, అయితే దంపతులుగా ఇక కొనసాగలేమని బిల్ గేట్స్ ( Bill gates )వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన విడాకులు తీసుకున్న ఏడు జంటలు ఉన్నాయి. వారిపై ఓ లుక్కేద్దాం.
జెఫ్ బెజోస్, మాకెంజీ స్కాట్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2019 లో మాకెంజీ స్కాట్ నుంచి విడిపోవడం చరిత్రలో అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచారు. బెజోస్ నుంచి విడాకులు తీసుకున్నందుకు స్కాట్ 38 బిలియన్ డాలర్ల మొత్తాన్ని అందుకున్నది. ప్రస్తుతం 6.1 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నది. బెజోస్ నుంచి అందిన మొత్తంతో ఈమె ప్రపంచంలోనే మూడవ సంపన్న మహిళగా నిలిచింది.
బెజోస్ సహాయకురాలుగా స్కాట్ పనిచేయాల్సి వచ్చినప్పుడు 1992 లో ఇద్దరు కలుసుకున్నారు. మూడు నెలలపాటు డేటింగ్లో ఉన్నవీరు వివాహం చేసుకుని 1994 లో వాషింగ్టన్‌లోని సీటెల్‌కు పయనమయ్యారు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు.
రూపర్డ్ ముర్దోక్, అన్నా మరియా మన్

మీడియా మొఘల్ అయిన రూపర్డ్ ముర్దోక్ 1999 లో స్కాట్లాండ్ జర్నలిస్ట్, నవలా రచయిత అన్నా మరియా మన్ నుంచి విడాకులు తీసుకోవటానికి భారీ మొత్తం ఖర్చుచేశారు. సెటిల్మెంట్ ద్వారా 1.7 బిలియన్ డాలర్లు , 110 మిలియన్ డాలర్ల నగదును అందుకున్నారు. ముర్దోక్‌కు మన్ రెండవ భార్య. వీరికి ముగ్గురు పిల్లలు.
టైగర్ వుడ్స్, ఎలిన్ నార్డెగ్రెన్

ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్ పెండ్లి చేసుకున్న ఆరేండ్ల తర్వాత భార్య ఎలిన్ నార్డెగ్రెన్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల విలువ 710 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. నార్డెగ్రెన్ స్వీడన్ నుంచి యూఎస్ లో పని చేయడానికి వెళ్ళినప్పుడు టైగర్ వుడ్స్ ను కలుసుకున్నారు. వారు 2004 లో వివాహం చేసుకుని.. 2010 లో విడిపోయారు.
మైఖేల్ జోర్డాన్, జువానిటా వనోయ్

బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ జోర్డాన్ 2006 లో జువానిటా వనోయ్ నుంచి విడాకులు తీసుకున్నందుకు 168 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. ఇద్దరూ మొదట విడాకుల కోసం 2002 లో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత రాజీ పడ్డారు. 2006 లో తిరిగి విడాకుల కోసం దాఖలు చేశారు. వనోయ్ అందుకున్న మొత్తం ఆ సమయంలో పబ్లిక్ రికార్డ్‌లో అతిపెద్ద ప్రముఖ విడాకుల పరిష్కారంగా చెప్పుకునేవారు.
సాంగ్ జోంగ్-కి, సాంగ్ హే-క్యో

దక్షిణ కొరియా తారలు సాంగ్ జోంగ్-కి, సాంగ్ హే-క్యో (వీరిని సాంగ్ సాంగ్ జంట అని కూడా పిలుస్తారు) జంట విడాకులు ఆసియాలో అతి ఖరీదైనది. ఈ జంట ఆస్తులను, సెటిల్మెంట్ డబ్బును విభజించకపోయినప్పటికీ.. వారిద్దరికీ 86.5 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇద్దరు దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందిన నటులుగా ఉన్నారు. సాంగ్ జోంగ్-కి 2.2 మిలియన్ డాలర్ల విలువైన విల్లాను కలిగి ఉండగా.. సాంగ్ హే-క్యోకు 17.8 మిలియన్ డాలర్ల విలువైన మూడు భవంతులు ఉన్నాయి. ఇటావోన్లోని మాజీ జంట భవనం విలువ 8.6 మిలియన్ డాలర్లు.
చెయ్ టే-వన్, రోహ్ సోహ్-యోంగ్

వీరి విడాకులను “శతాబ్దపు విడాకులు” గా పిలువబడుతుంది. ఎస్కె గ్రూప్ ఛైర్మన్ చె టే-విన్, ఆర్ట్ మ్యూజియం డైరెక్టర్ రోహ్ సోహ్-యోంగ్ విడాకుల ధర 1.6 బిలియన్ డాలర్లు. దక్షిణ కొరియా మూడవ అతిపెద్ద సంస్థ అయిన ఎస్కె హోల్డింగ్స్ కోలో ఇది 42.3 శాతం వాటా కలిగి ఉన్నది. ఇద్దరూ మంచి కుటుంబాల నుంచి వచ్చారు, చెయ్ ఎస్కె గ్రూపునకు వారసుడిగా ఉండగా.. రోహ్ అధ్యక్షుడిగా మారిన మాజీ ఆర్మీ జనరల్ కుమార్తె.
హారిసన్ ఫోర్డ్, మెలిస్సా మాతిసన్

నటుడు హారిసన్ ఫోర్డ్, దివంగత స్క్రీన్ రైటర్ మెలిస్సా మాతిసన్ 2004 లో విడాకులు తీసుకున్నందుకు 118 మిలియన్ డాలర్లు ఖర్చయింది. ఫోర్డ్ మాతిసన్ రెండవ భార్య. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
భారత్‌కు వినోద్ ఖోస్లా 10 మిలియన్ డాలర్ల సాయం
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
లాక్డౌన్ విధించండి.. క్యాట్ సర్వేలో ప్రజలు
ఈ నెల 10 న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న కేపీ ఒలి
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

