ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
ఈ ఏడాది చివరికల్లా 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు 13 కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది.

న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరికల్లా 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు 13 కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది. చైనా కంపెనీలైన హువావే, జెడ్‌టీఈలను 5 జీ ట్రయల్‌కు దూరంగా ఉంచారు. 5 జి ట్రయల్స్ కోసం టెలికం విభాగానికి మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి.
5 జీ ట్రయల్ కోసం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రంను 1984 లో స్థాపించారు. భారతి ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో సంస్థలు ఎరిక్సన్, నోకియాకు చెందిన విక్రేతలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.
5 జీ ట్రయల్ కోసం టెలికాం కంపెనీలకు త్వరలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఎయిర్ వేవ్స్ ఇవ్వనున్నట్లు టెలికం విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు వంటి షరతులను కంపెనీలు పాటించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. నెట్వర్క్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు.
వాణిజ్య ఉపయోగానికి నో ఛాన్స్
టెలికాం కంపెనీలకు ఎయిర్‌వేవ్స్‌ను ట్రయల్స్‌కు మాత్రమే ఉపయోగించేలా ఇవ్వనున్నారు. వాణిజ్యపరంగా ఉపయోగించకుండా కఠిన హెచ్చరికలు చేయనున్నారు. కంపెనీలు ఈ షరతులను ఉల్లంఘిస్తే వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని టెలికం విభాగం హెచ్చరిస్తున్నది.
ఈ దేశాల్లో అందుబాటులో 5 జీ సేవలు
5 జీ సేవలను మొదట దక్షిణ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశపెట్టారు. 5 జీ ట్రయల్స్ ప్రారంభించేందుకు భారత్ సన్నాహాలు చేస్తున్నప్పటికీ.. ఈ రకం సేవలు ఇప్పటికే 68 దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఇందులో శ్రీలంక, ఒమన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి అనేక చిన్న దేశాలు కూడా ఉండటం విశేషం.
ఇవి కూడా చదవండి..
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
Uttam Kumar Reddy | పెత్తనం లేని ఉత్తమ్..! ఉత్సవ విగ్రహంగా మిగిలిన సీనియర్ మంత్రి
YTPC | అంధకారంలో ఆశాదీపం..! కేసీఆర్ కలల ప్రాజెక్టు వైటీపీఎస్ ఐదో యూనిట్ సింక్రనైజేషన్ పూర్తి
Hardeep Puri | ఎప్స్టీన్తో హర్దీప్ రహస్య సమావేశం..! ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

