చైనాలో ఉయ్గార్ ముస్లింలపై దారుణాలకు వ్యతిరేకంగా న్యూజిలాండ్ పార్లమెంటు ప్రతిపాదన
బ్రిటన్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం.. చైనాకు వ్యతిరేకంగా గలమెత్తింది. చైనాలో ఉయ్గార్ ముస్లింలపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు

వెల్లింగ్టన్: బ్రిటన్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం.. చైనాకు వ్యతిరేకంగా గలమెత్తింది. చైనాలో ఉయ్గార్ ముస్లింలపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఉయ్గార్లపై జరిగిన దారుణాలకు సంబంధించి న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఈ ప్రతిపాదనను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనపై అన్ని పార్టీలు చర్చించాయి. అనంతరం అందరి సమ్మతితో ఈ ప్రతిపాదనను ఆమోదించారు.
రెండు రోజుల క్రితం ఆక్లాండ్‌లో జరిగిన చైనా బిజినెస్ మీట్లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ స్వరం పెంచారు. జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనపై చైనాపై నేరుగా విమర్శలు చేశారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉయ్గార్పై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడా వరుసలో న్యూజిలాండ్ చేరింది.
పశ్చిమ జిన్జియాంగ్లోని ఉయ్గార్ ముస్లిం జనాభా దోపిడీకి గురవుతున్న చైనా విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గత నెలలో బ్రిటిష్ చట్టసభ సభ్యులు పార్లమెంటరీ తీర్మానాన్ని ఆమోదించారు. యూఎస్, కెనడా వంటి దేశాలు జిన్జియాంగ్లో చైనా చర్యలను మారణహోమం అని పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
బుద్గాంలో డీఆర్డీఓ 500 పడకల దవాఖాన
టీకా వృథా తగ్గేలా చేస్తున్న కేరళకు ప్రధాని ప్రశంసలు
భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్..?
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్‌ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్‌పాత్‌పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

