లక్నో: జిరాక్స్ షాపు పక్కన కాలువపై ఉన్న స్లాబ్ కూలిపోయింది. దానిపై నిల్చొన్న సుమారు 25 మంది బీఈడీ అభ్యర్థులు ఆ మురికి కాలువలో పడిపోయారు. అక్కడున్న కొందరు వారిని బయటకు తీసేందుకు సహకరించారు. (BEd aspirants fall into drain) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఆ రాష్ట్రంలో బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. కాన్పూర్లోని ఒక పరీక్షా కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులు ఆధార్ జిరాక్స్ కోసం సమీపంలోని జిరాక్స్ షాపు వద్ద గుమిగూడారు.
కాగా, ఆ షాపు పక్కన మురుగు కాలువపై ఉన్న పాత కాంక్రీట్ స్లాబ్పై చాలా మంది నిలబడ్డారు. అంత మంది బరువు తట్టుకోలేక శిథిలావస్థలో ఉన్న ఆ స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అభ్యర్థులు, వారి వెంట ఉన్న వారితో సహా సుమారు 25 మంది మురుగు కాలువలో పడిపోయారు. అక్కడున్న కొందరు వ్యక్తులు వెంటనే స్పందించారు. కాలువలో పడిన వారు పైకి వచ్చేందుకు సహాయం చేశారు.
మరోవైపు ఈ సంఘటనలో నలుగురు అభ్యర్థులు స్వల్పంగా గాయపడ్డారు. పలువురి అభ్యర్థుల దుస్తులు, పుస్తకాలు, అడ్మిట్ కార్డులు, ఇతర పత్రాలు మురికి అయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చివరి నిమిషంలో ఆధార్ కాపీ కావాలని పరీక్ష నిర్వాహకులు చెప్పడంతో జిరాక్స్ షాపుల వద్ద రద్దీ పెరుగటంతో ఈ సంఘటన జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపించారు.
कानपुर में नालों के ढक्कन इतने मजबूत होते हैं कि 20-25 लड़कों का भार भी नहीं उठा सकते।
📍मैकरॉबर्ट्स गंज, कानपुर pic.twitter.com/ICFdbNQvln
— Kanpur Needs (@kanpursneed) May 31, 2026