Rice Bran Oil | చర్మానికి, శిరోజాలకు ఎంతో మేలు చేసే రైస్ బ్రాన్ ఆయిల్.. ఎలా ఉపయోగించాలంటే..
చర్మం, జుట్టు సంరక్షణ కోసం సహజ నూనెలను ఉపయోగించడం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా, తేమగా ఉంచడంలో కొన్ని సహజ నూనెలు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంటల్లో, సలాడ్ డ్రెస్సింగ్‌గా ఉపయోగించే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా చర్మం, జుట్టు సంరక్షణలో ఉపయోగపడే నూనెల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.
Rice Bran Oil | చర్మం, జుట్టు సంరక్షణ కోసం సహజ నూనెలను ఉపయోగించడం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా, తేమగా ఉంచడంలో కొన్ని సహజ నూనెలు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వంటల్లో, సలాడ్ డ్రెస్సింగ్‌గా ఉపయోగించే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా చర్మం, జుట్టు సంరక్షణలో ఉపయోగపడే నూనెల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బియ్యం గింజపై ఉండే బయటి పొరను రైస్ బ్రాన్ అంటారు. ఈ పొర నుంచి తీసే నూనెనే రైస్ బ్రాన్ ఆయిల్గా పిలుస్తారు. ఇందులో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
తలకు మృదువుగా మసాజ్ చేస్తే..
రైస్ బ్రాన్ ఆయిల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండటంతో జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చిట్లిపోయే లేదా గజిబిజిగా ఉండే జుట్టుకు ఈ నూనె ఉపయోగపడుతుంది. జుట్టు కడగడానికి ముందు రైస్ బ్రాన్ ఆయిల్‌తో తలకు మృదువుగా మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఎండలోని అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్‌ను చర్మంపై మృదువుగా మసాజ్ చేయడం వల్ల సూర్యకిరణాలు, కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే దీన్ని సహజమైన సన్‌స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు. సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం ప్రత్యేక సన్‌స్క్రీన్‌కు ఇది ప్రత్యామ్నాయం అని మాత్రం భావించకూడదు.
మేకప్‌ను తీసేందుకు..
రైస్ బ్రాన్ ఆయిల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు మేకప్‌ను తొలగించడంలో కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మంలోని పొరల్లోకి చొచ్చుకుపోయే లక్షణాన్ని కలిగి ఉండటంతో, మేకప్ తొలగించిన తర్వాత చర్మం మృదువుగా, తేమగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణను అందించడంతోపాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు త్వరగా తెల్లబడే ప్రక్రియను ఆలస్యం చేయడంలోనూ రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగపడుతుంది. గోరువెచ్చని రైస్ బ్రాన్ ఆయిల్‌తో వారానికి రెండుసార్లు జుట్టుకు మసాజ్ చేయడం, షాంపూలో రెండు మూడు చుక్కల నూనె కలపడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
కళ్ల సమస్యలకు..
కళ్ల కింద నల్లని వలయాలు, ఉబ్బినట్లు కనిపించే కళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగపడుతుంది. కళ్ల చుట్టూ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. నూనెలో అధికంగా ఉండే స్టెరాల్స్ కళ్ల కింద చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే చర్మం లేదా జుట్టుపై ఏదైనా సహజ నూనెను ఉపయోగించే ముందు, ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు, చిన్న ప్రాంతంలో పరీక్షించి చూడటం మంచిది. ఏదైనా అలర్జీ లేదా చర్మ సమస్య కనిపిస్తే ఉపయోగించడం ఆపి నిపుణులను సంప్రదించడం అవసరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

