ఇక ఒక్కరోజులోనే డేట్..మీట్..చాట్!

లండన్ : డిజిటల్ యుగంలో తమకు నచ్చిన జోడీని ఎన్నుకునేందుకు డేటింగ్ యాప్ లనే పలువురు ఆశ్రయిస్తున్నారు. డేటింగ్ యాప్స్ లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ వారానికి ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉండే ఓ కొత్త డేటింగ్ యాప్ వినూత్న ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. వారానికి ఆరు రోజులు ఈ డేటింగ్ యాప్ అందుబాటులో ఉండదు. లండన్ కు చెందిన డిజిటల్ డేటింగ్ వేదిక థర్స్ డే పేరుతో మే 13న లండన్, న్యూయార్క్ ల్లో లాంఛ్ కానుంది. ఆ తర్వాత కొద్ది రోజులకకు డబ్లిన్, కార్డిఫ్, గ్లాస్గో ప్రాంతాల సింగిల్స్ కూ అందుబాటులోకి రానుంది. థర్స్ డే యాప్ లో తమ జోడీలను వెతుక్కునేందుకు ఇప్పటికే 1.1 లక్షల మంది యూజర్లు సైనిన్ అయ్యారని యాప్ నిర్వాహకులు వెల్లడించారు.
అర్దరాత్రిలోపు కనుమరుగయ్యే మ్యాచెస్ నుంచి యూజర్లు కనెక్ట్ కావాల్సి ఉంటుంది. ప్రజలు ఎక్కువ సమయం డేటింగ్ యాప్స్ పై కుస్తీ పడుతున్నారని ఇది ఒత్తిడిని పెంచి ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితికి దారి తీసి విసుగు తెప్పిస్తోందని నూతన డేటింగ్ యాప్ నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకే తమ యాప్ వారానికి ఒక్కరోజే పనిచేసేలా డిజైన్ చేశామని వారు చెప్పుకొచ్చారు. డేటింగ్ యాప్స్ కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయని అందుకే తాము ఈ యాప్ తో ఒక్కరోజులోనే సింగిల్స్ తమ జోడీని ఎంపిక చేసుకుని వారితో చాట్ చేయడం కలుసుకోవడం వంటివి చేయవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

