న్యూఢిల్లీ: ఈ నెల 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్నది. గత నెలాఖరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధ పరికరాలపై పన్ను మినహాయింపుపై చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (జీవోఎం) నివేదిక సమర్పించింది.
దీంతో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్నట్టు ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. ఈ భేటీలో కరోనా వ్యాక్సిన్లు, ఇతర ఔషధాలు, అత్యవసర చికిత్స వస్తువులు, బ్లాక్ ఫంగస్ ఔషధాలపై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
కరోనాకు చికిత్సకు వాడే సామగ్రైన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని మే 28వ తేదీన జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కోరారు.
ఈ సామగ్రిపై పన్ను మినహాయించే అంశంపై అధ్యయనానికి మేఘాలయ సీఎం కన్రడ్ సంగ్మా నేతృత్వంలో జీవోఎం ఏర్పాటైంది. ఈ జీవోఎంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్ రావు కూడా సభ్యులు.
కన్రడ్ సంగ్మా సారధ్యంలోని జీవోఎం.. ఈ నెల ఏడో తేదీన నివేదిక సమర్పించిందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. కమిటీ సభ్యుడు, యూపీ ఆర్థికమంత్రి సురేశ్ కుమార్ ఖన్నా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ రోగులకు ఉపశమనం కలిగించడానికి తమ రాష్ట్రం అనుకూలమేన్నారు.
కరోనా రోగులకు ఉపశమనం కల్గించేలా కరోనా చికిత్స సామాగ్రిపై పన్నులు తగ్గించే అంశంపై తమ రాష్ట్రం అనుకూలంగానే ఉన్నదని సురేశ్ కుమార్ ఖన్నా చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లను అంగీకరించాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్లపై ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
మా పెళ్లి చెల్లదు : భర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్రత్
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
హెల్మెట్‌ను నోట్లోకి లాగేసిన ఏనుగు.. వీడియో వైరల్
ఇక నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి.. ఎల్పీజీ రీఫిల్
ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్!
ost Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి