సోమవారం 01 జూన్ 2020
Business - May 07, 2020 , 07:58:04

సేవారంగం భారీ క్షీణ‌త‌

సేవారంగం భారీ క్షీణ‌త‌

ముంబయి: క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని రంగాలు కుదేల‌వుతున్నాయి. ముఖ్యంగా సేవ‌ల రంగం భారీగా క్షీణించింది. ఏప్రిల్‌లో భారత సేవల రంగ కార్యకలాపాలు రికార్డు స్థాయిలో  కనిష్ఠానికి పరిమితమయ్యాయి.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పలు వ్యాపారాలు మూతపడటం సేవల రంగంపై తీవ్ర‌ ప్రభావం చూపింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ ఏప్రిల్‌లో 5.4 పాయింట్లుగా ఉండ‌గా... మార్చిలో నమోదైన 49.3తో పోలిస్తే ఈసారి భారీ క్షీణత నమోదైంది. 2005 డిసెంబరులో సేవల గణాంకాలు రూపొందించడం మొదలైన తర్వాత.. గత 15 ఏళ్లలో ఇదే అత్యంత భారీ క్షీణతగా తెలుస్తోంది. పీఎంఐ గణాంకాల ప్రకారం.. 50 పాయింట్ల ఎగువన నమోదైతే వృద్ధి అయినట్లుగా.. అంతకంటే తక్కువైతే క్షీణతగా పరిగణిస్తారు. కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల గత నెలలో పీఎంఐ సేవల రంగ సూచీ 40 పాయింట్లకు పైగా క్షీణించిందని పేర్కొంది.


logo