Sudigadu 2 | సుడిగాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లరి నరేష్
Aa Okkati Adakku | అల్లరి నరేశ్ (Allari Naresh) కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా(Faria Abdulla) కథనాయికగా నటిస్తుంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Aa Okkati Adakku | అల్లరి నరేశ్ (Allari Naresh) కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా(Faria Abdulla) కథనాయికగా నటిస్తుంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 03న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ వేడుకలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు.
తన కెరీర్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను. ప్రస్తుతం పార్ట్ 2 కు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు అల్లరి నరేష్ తెలిపాడు. ఇక సుడిగాడు సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమా కేవలం 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 32 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

