Thug Life | లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు ‘నాయగన్’ (నాయకుడు) సినిమా వచ్చింది. బాంబే బ్యాక్‌డ్రాప్‌లో 1987లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమా అనంతరం సుమారు 37 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’ తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ను వాయిదా వేసింది. తాజాగా తొలి దశలో తమిళనాడులో ఎన్నికలు పూర్తవ్వడంతో ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఢిల్లీలో ఆరంభమైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఈ సినిమాలో త్రిష కథానాయికగా కనిపించనుండగా.. జయం రవి, గౌతమ్ కార్తీక్ పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో కనిపించనున్నారు. అనౌన్స్మెంట్ వీడియోలో శత్రువులతో పోరు చేస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపించారు కమల్. వచ్చే ఏడాది ప్రధమార్థంలో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది.