Deadpool & Wolverine | మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూల్ (Deadpool) సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ (Deadpool & Wolverine). ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ చూస్తే.. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంది. వోల్వారిన్గా హ్యూగ్ జాక్మాన్, డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.