(Gift to Badvel) కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణానికి ప్రత్యేక కానుక ఇచ్చారు. బద్వేలును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఏడాది జులైలో బద్వేలులో పర్యటించిన జగన్.. బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు.
బద్వేల్‌ను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ జీఓ జారీ అయింది. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బద్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభోత్సవం అనంతరం పార్టీ నేతల సమక్షంలో జగన్ కేక్ కోసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..