శనివారం 23 జనవరి 2021
Andhrapradesh-news - Nov 29, 2020 , 19:01:20

ఏపీలో కొత్తగా 620 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 620 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కరోనా మహమ్మారి వైరస్‌ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది.  గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 620 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 3,787 మంది కోలుకొని డిశ్చార్జికాగా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,67,683కు చేరింది.

ఇవాళ్టి వరకు 8,52,298 మంది కోలుకున్నారు. మరో 8397 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా 6988 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,00,17,126 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo