టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో భీమిలి కబడ్డీ జట్టు, క్రికెట్ ఇతివృత్తంతో జెర్సీ సినిమాలు చేశాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. జెర్సీ అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా నాని మరో స్పోర్ట్స్ డ్రామా ప్రాజెక్టును లైన్ లో పెట్టబోతున్నట్టు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
మరి ఇంతకీ ఈ సారి నాని కన్ను పడింది ఏ క్రీడపైనో తెలుసా..లేటెస్ట్ టాలీవుడ్ సమాచారం మేరకు నాని ఫుట్ బాల్ కథాంశంతో రానున్న సినిమాలో కనిపించబోతున్నట్టు టాక్. కొత్త దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో నాని పచ్చ జెండా ఊపాడని, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో స్పష్టత రానుంది.
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్