అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన శిరీష్ తన ప్రతి సినిమాతో తానెంటో నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మంచి హిట్ అందుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తున్న అదృష్టం ఆయనకు కలిసి రావడం లేదు. ప్రస్తుతం అను ఎమ్మాన్యుయేల్తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కరోనా వలన ఆగిపోయింది. దీంతో ఇంటికి పరిమితం అయిన శిరీష్ తన మేకొవర్ పూర్తిగా మార్చుకుంటున్నాడు.
అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన బన్నీ ఎప్పుడో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను స్టార్ట్ చేయగా, ఇప్పుడు లేటెస్ట్ గా శిరీష్ తన స్టన్నింగ్ మేకోవర్ ను బయట పెట్టాడు. ఇంతకు ముందు అంటే కాస్త భిన్నంగా ఉన్నానంటూ ఈసారి ఏకంగా ఆరు పలకల దేహాన్ని సిద్ధం చేసి ఆశ్చర్యపరిచాడు. అతని లుక్ చూసి అభిమానులు స్టన్ అవుతున్నారు.