జూలై చివరికి విముక్తి
- ఈ నెలాఖరుకు 1.5 లక్షల దిగువకు రోజువారీ కేసులు
- రెండో వేవ్ తగ్గిన 6-8 నెలల్లో మూడోవేవ్
- కొవిడ్ నిబంధనలు పాటిస్తే తప్పించుకోవచ్చు
- వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచితేనే అది సాధ్యం
- కరోనా శాస్త్రవేత్తల ప్యానల్ సూచన

న్యూఢిల్లీ, మే 20: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ జూలై చివరి కల్లా పూర్తిగా తగ్గుతుందని భారత శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ) కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడు, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. ఈ నెల చివరికి రోజువారీ కేసులు 1.5 లక్షలకు పడిపోతాయని, జూలై చివరికి రోజుకు 20వేల దిగువకు చేరుతాయని చెప్పారు. సెకండ్ వేవ్ తగ్గిన 6-8 నెలల్లో మూడో వేవ్ రావొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అది కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందని చెప్పారు. దాని ప్రభావం కూడా తక్కువేనన్నారు. అప్పటివరకు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకోవడం, ప్రజల్లో కరోనాకు ఇమ్యూనిటీ పెరగడమే ఇందుకు కారణం అన్నారు. వ్యాక్సినేషన్ వేగం పెంచి, కొవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో వేవ్ ముప్పును తప్పించుకోవచ్చని ఇదే బృందంలో ఉన్న మరో శాస్త్రవేత్త విద్యాసాగర్ అన్నారు.
‘సూత్ర’ అనే ప్రత్యేక గణిత పద్ధతిని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. గతంలో కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్‌రాఘవన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మూడో వేవ్ తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

